వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ 2050 : మనిషి గల్లంతే.. భవిష్యత్తులో స్నేహం, ప్రేమ, పెళ్లి అన్నీ వాటితోనే..

భవిష్యత్తులో మనిషి అవసరం మనిషికి ఉండదట. మనుషులకన్నా అందమైన, తెలివైన రోబోలు మనిషి స్థానాన్ని ఆక్రమిస్తాయట. మనుషులు రోబోలతో స్నేహం చేస్తారట.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన 'రోబో' సినిమా గుర్తుంది కదా! అందులో రజనీకాంత్ తన రూపురేఖలతో మానవ మేధస్సుకు దీటైన ఒక రోబోను తయారుచేసి 'చిట్టి' అని పేరు పెట్టడం, అది ఏకంగా ఐశ్వర్యారాయ్ నే ప్రేమించడం.. ఇదంతా కల్పన అని, సినిమాలోనే అలా చూపిస్తారని అనుకోకండి. ఎందుకంటే, సమీప భవిష్యత్తులో ఇది నిజంగా జరుగుతుందట!

చదవండి: సెక్స్ రోబోట్ లతో... సరికొత్త శృంగారం

భవిష్యత్తులో మనిషి అవసరం మనిషికి ఉండదట. మనుషులకన్నా అందమైన, తెలివైన రోబోలు మనిషి స్థానాన్ని ఆక్రమిస్తాయట. మనుషులు రోబోలతో స్నేహం చేస్తారట. అంతేకాదు, వాటినే ప్రేమించి, చివరకు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారట. ఇదంతా జరగడానికి ఏదో వందల సంవత్సరాలేం ఆగనక్కర్లేదట. 2050 నాటికల్లా హ్యూమన్-రోబో మధ్య ఇలాంటి సంబంధం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలే చెబుతున్నారు.

కృత్రిమ మేథస్సుదే రాజ్యం...

కృత్రిమ మేథస్సుదే రాజ్యం...

రోజురోజుకీ మనిషి జీవితం యాంత్రికంగా మారిపోతోంది. ఆటోమేషన్ దెబ్బకు లక్షలాది ఉద్యోగాలు గల్లంతవుతున్నాయి. భవిష్యత్తు జీవితం దుర్భరం కానుందని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు రాబోయే రోజుల్లో కృత్రిమ మేథస్సును విరివిగా ఉపయోగిస్తారని అంటున్నారు. మనిషి మేథస్సు అవసరం లేని చోట ఇప్పటికే రోబోలను ఉపయోగిస్తున్నారు. కృత్రిమ మేథస్సు కలిగిన రోబోల తయారీ కూడా వేగం పుంజుకుంటోంది. ఇప్పటికే చైనా, జపాన్ వంటి దేశాల్లో మనుషులను పోలిన రోబోల వినియోగం పెరిగింది. 2050 నాటికల్లా మనిషికి దీటైన రోబో వస్తుందని, అది మనిషిని అన్ని విధాలా మురిపిస్తుందని అంటున్నారు.

మనుషులతో చెట్టపట్టాల్...

మనుషులతో చెట్టపట్టాల్...

బీజీ లైఫ్ కి అలవాటు పడిపోయి ఇప్పటికే మనుషులు రక్తసంబంధీకులకు దూరం అయిపోయారు. ఒక కడుపున పుట్టిన అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు సైతం ఏదో పండక్కో, పబ్బానికో తప్ప కలవడం లేదు. కని పెంచిన తల్లిదండ్రులతోనే సంబంధ బాంధవ్యాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆడ, మగ.. ఒంటరి జీవితానికి అలవాటు పడిపోతున్నారు. ఇదిలాగే సాగితే.. భవిష్యత్తులో మనిషికి మనిషి దూరమవడం ఖాయం. మరి మనిషికి తోడెవరంటే.. రోబో! అవును, మగాడికి ఆడ రోబో, ఆడదానికి మగ రోబో తోడవుతుంది. 2050 నాటికల్లా కృత్రిమ మేథస్సు కలిగిన రోబోలు మనుషులతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతాయట.

స్నేహం, ప్రేమ.. చివరికి పెళ్లి కూడా...

స్నేహం, ప్రేమ.. చివరికి పెళ్లి కూడా...

కేవలం మనిషి అవసరాలు తీర్చడానికే కాదు, వారి భావోద్వేగాలు పంచుకునే రోబోలు కూడా వస్తాయట. ఫలితంగా రోబోలతో మనుషులకు స్నేహం ఏర్పడుతుందని, ఆ స్నేహం ప్రేమగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, 2050 నాటికి మనుషులు తమకు నచ్చిన రోబోలను వివాహం కూడా చేసుకుంటారట. మనుషులకంటే రోబోలే అందంగా ఉండటం, అవి తమ భావోద్వేగాలను కూడా పంచుకోవడంతో మనుషులు సహజంగానే వాటిపై ప్రేమను పెంచుకుంటారట. ఈ నేపథ్యంలో స్త్రీ, పురుషుల నడుమ ప్రకృతి సహజమైన సంబంధం కూడా పలుచబడిపోతుందని, మనిషి జీవితంలో రోబో పాత్ర కీలకంగా మారి, రోబోలనే తమ జీవిత భాగస్వాములుగా చేసుకుంటారని తెలుస్తోంది.

నో ప్రాబ్లమ్స్.. అంతా హ్యాపీస్..

నో ప్రాబ్లమ్స్.. అంతా హ్యాపీస్..

భవిష్యత్తులో అంటే 2050 నాటికి రోబో, మనిషి మధ్య వ్యవహారం సర్వసాధారణం కానుంది. రోబోలతో వివాహాలకు సైతం చాలా దేశాలు చట్ట బద్ధత కల్పించే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోబోల తయారీలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అబ్బాయిల కోసం అందగత్తెలను తలదన్నే రోబోలను తయారు చేస్తున్నారు. అలాగే అమ్మాయిల కోసం రాకుమారుల్లాంటి మరమనుషులు మార్కెట్‌లోకి రానున్నాయి. దీని వల్ల ఇప్పుడు మనుషులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు తీరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. రోబోలతో శృంగారం కూడా సేఫ్ అని, వాటి వల్ల ఎలాంటి లైంగిక వ్యాధులు రావని అంటున్నారు. అంతేకాదు, రోబోలు మనం ఎలా చెబితా అలా వింటాయని.. ఫలితంగా భవిష్యత్తులో భార్య భర్తల నడుమ అసంతృప్తులు, తగాదాలు ఉండవని, పోలీసు కేసులు, విడాకులు లాంటి చిక్కులూ తలెత్తవని నిపుణులు పేర్కొన్నారు.

English summary
Humans will marry robots in the next 35 years, according to a sex robot expert. Not only this, but sex with robots will become more enjoyable than with other humans, because of the advancement of artificial intelligence, he said. Robots will also be more attractive than their human counterparts, according to London-based Dr David Levy, author of 'Love and Sex with Robots'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X