వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ నేత ఇంట్లో ఖైదీ నెం. 150 విలన్ హల్‌చల్

ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న మెగాస్టార్‌ 150వ చిత్రం ఖైదీ నంబర్‌ 150లో విలన్ పాత్రధారి తరుణ్‌ అరోరా ఆదివారం నగరిలో సందడి చేశారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న మెగాస్టార్‌ 150వ చిత్రం ఖైదీ నంబర్‌ 150లో విలన్ పాత్రధారి తరుణ్‌ అరోరా ఆదివారం నగరిలో సందడి చేశారు. టీడీపీ నాయకుడు చలపతి ఇంటికి ఆయన విచ్చేశారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నగరి మున్సిపాలిటీ 1వ వార్డులోని సామాలమ్మ ఆలయంలో అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు.

స్వామివారి సేవలో..

స్వామివారి సేవలో..

అనంతరం కరియమాణిక్య స్వామి ఆలయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీనివాస థియేటర్‌లో ఖైదీ నంబర్‌ 150 చిరంజీవి సినిమాకు వెళ్లి అక్కడ ప్రేక్షకులతో కొంతసేపు ముచ్చటించారు.

శాలువాతో సత్కారం

శాలువాతో సత్కారం

థియేటర్‌ యజమాని మోహన తరుణ్‌ అరోరాను శాలువతో ఘనంగా సత్కరించారు. తరుణ్‌తో ఫొటోలు దిగడానికి పలువులు పోటీపడ్డారు. టీడీపీ నాయకుడు ఆనం శ్రీహరి నాయుడు ఇంటికి వెళ్లారు. అతడ్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో యువకులు వచ్చారు.

మెగాస్టర్ చిత్రంలో అదృష్టమే..

మెగాస్టర్ చిత్రంలో అదృష్టమే..

ఈ సందర్భంగా తరుణ్‌ అరోరా మాట్లాడుతూ... మెగాస్టార్‌ 150వ చిత్రంతో విలన్‌ పాత్ర దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తాను అస్సాంలో పుట్టానని, 18 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టానని తెలిపారు. 2009లో బాలీవుడ్‌లో ప్రవేశించి ‘షైన' సినిమాలో నటించానని చెప్పారు.

పెద్ద హీరోలతోనే..

పెద్ద హీరోలతోనే..

తమిళంలో మణిదన, కత్తిసండై సినిమాల్లో నటించినట్లు తెలిపారు. నగరికి చెందిన చలపతి, చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ ద్వారా ఖైదీ నంబర్‌ 150 చిత్రంలో విలన్‌గా నటించే అవకాశం వచ్చిందన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ ‘కాటమరాయుడు'లో నటిస్తున్నానని చెప్పారు త్వరలో బాలకృష్ణతో కూడా నటించే అవకాశం ఉందన్నారు. అగ్ర దర్శకులు బోయపాటి శీను, రాజమౌళి, కొరటాల శివ సినిమాల్లో నటించబోతున్నట్లుగా ఆయన తెలిపారు.

English summary
Cine Actor Tarun Arora on visited samalamma temple in chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X