వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజా అసలు పేరేమిటి: టిడిపి ఎంపీ సినిమా కబుర్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఢిల్లీలో వివిధ వేషాలతో అలరించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ గుర్తుండే ఉంటారు. ఆయన నిరసన కార్యక్రమాలు కూడా ఆసక్తికరంగా ఉండడం చాలా మందికి తెలిసిన విషయమే.

Recommended Video

ఫ్యూచర్-రిలయెన్స్‌తో జట్టు అందుకే ! విలేజ్ మాల్స్‌ నో యూజ్ ? | Oneindia Telugu

విచిత్రమైన వేషధారణలో నిరసన తెలియజేయడం ఆయనకు మాత్రమే సొంతమనే పేరును గడించారు. ఆయితే, ఆయన మంచి సినిమా నటుడనే విషయం బహుశా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. ఆయన తన సినిమా అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

సప్తగిరి ఎల్ఎల్‌బీలో శివప్రసాద్

సప్తగిరి ఎల్ఎల్‌బీలో శివప్రసాద్

ఇటీవల శివప్రసాద్ 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' చిత్రంలో జడ్జి క్యారెక్టర్‌లో నటించి విశేషమైన ఆదరణ పొందారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన పాత్రల గురించి ఆయన వివరచారు. సినీ నటి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు రోజా గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

 కామెడీకి అప్పట్లో ప్రాధాన్యం తక్కువే...

కామెడీకి అప్పట్లో ప్రాధాన్యం తక్కువే...

కామెడీకి అప్పట్లో అంత ప్రాధాన్యత వుండేది కాదని, ఎందుకో తెలియదని శివప్రసాద్ అన్నారు. అయితే 'ఖైదీ' సినిమాలో కోదండరామిరెడ్డి తనకు, సుత్తివేలుకి స్వేచ్ఛ ఇచ్చారని, సీన్లు చెప్పి కంటెంట్‌ ఇది అని వివరించారని అన్నారు. మీరు ఏమి డెవలప్‌ చేసుకుని చేస్తారో చేయండి అన్నట్లు ఆయన తెలిపారు.

 మేం సొంతంగానే చేశాం..

మేం సొంతంగానే చేశాం..

పాటలు, కామెడీ బిట్స్‌ సొంతంగా చెప్పినట్లు శివప్రసాద్ తెలిపారు. అవన్నీ బాగా సక్సెస్‌ అయ్యాయని, తర్వాత కొంతమంది కామెడీని పెద్దగా ఉపయోగించుకునేవారు కాదుని, పది సినిమాలు చేస్తే అందులో రెండు సక్సెస్‌ అయ్యేవని అన్నారు. తనకు సంతృప్తి ఉండేది కాదని, చేతిలో ఉన్న సినిమాలు చేసి తర్వాత మానేశానని, కాలేజీ ఉద్యోగంలో చేరిపోయానని చెప్పారు.

 ప్రాథమికంగా కళాకారుడిని కాబట్టి...

ప్రాథమికంగా కళాకారుడిని కాబట్టి...

ప్రాథమికంగా కాబట్టి ఇంట్లో ఖాళీగా కూర్చోలేకపోయేవాడినని, ఏడాది కనీసం రెండు సినిమాలకు దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నానని శివప్రసాద్ చెప్పారు. 1991లో 'ప్రేమతపస్సు' సినిమా ప్రారంభించామని ఆయన అన్నారు.

రోజా ప్రవేశం ఇలా...

రోజా ప్రవేశం ఇలా...

ఒక కొత్త అమ్మాయిని ప్రేమ తపస్సు సినిమా ద్వారా పరిచయం చేయాలని ఆరు నెలల పాటు తిరిగినట్లు శివప్రసాద్ తెలిపారు. తుదిగా శ్రీలత అనే అమ్మాయిని రోజాగా మార్చి ఆ చిత్రంతో పరిచయం చేసినట్లు ఆయన తెలిపారు. రోజాకి శిక్షణ ఇచ్చి నటిగా రూపుదిద్దామని చెప్పారు. నిర్మాత పోకూరి బాబూరావుని విలన్‌గా పరిచయం చేశామని, ఒక బాధ్యత తీసుకుని రోజాని హీరోయిన్‌గా అందరికీ చూపించామని అన్నారు.

 రోజా ఆ విధంగా..

రోజా ఆ విధంగా..

రామానాయుడు తనకు ఫోన్ చేసి గోపాలకృష్ణ చూస్తాడు ఒకసారి హీరోయిన్‌ సాంగ్స్‌, సీన్స్‌ చూపించాలని అడిగినట్లు శివప్రసాద్ చెప్పారు. తాను ఆటోలో కాన్లు పెట్టుకుని స్వయంగా వెళ్లి చూపించానని అన్నారు. గోపాలకృష్ణ చూసి ఒక సినిమాలో రోజాని హీరోయన్‌గా బుక్‌ చేసినట్లు తెలపారు. తన అల్లుడు వేణు తన దగ్గర వుండేవాడని, సెల్వమణి వచ్చి వేణుని కలిసి సాంగ్స్‌, సీన్స్‌ చూశాడని, రెండు ప్రాజెక్ట్‌లు వచ్చాయని, జాగ్రత్తగా నువ్‌ చేసుకో అని రోజాకి చెప్పానని ఆయన అన్నారు.

English summary
Telugu Desam MP Shiva Prasad has revealed YSR Congress party leader Roja's real name and her Tollywood entry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X