వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"అపోహలు పటాపంచలు.. ఆ ఘనత అనురాగ్ శర్మదే, చరిత్రలో అలాంటి సందర్భం లేదు"

తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ అన్నారు. తక్కువ కాలంలోనే ఎన్నో కొత్త విధానాలను ఇక్కడి పోలీసులు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. షీ టీమ్స్ ఏర్పాటు చేయడంతో,

|
Google Oneindia TeluguNews

Recommended Video

Outgoing DGP Anurag Sharma To Be Given Farewell By KCR

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సేవలందించి ఇటీవలే పదవి విరమణ చేసిన అనురాగ్ శర్మను ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. మంగళవారం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఘనమైన సన్మానం ద్వారా ఆయనకు వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అనురాగ్ శర్మ సేవలను ప్రశంసించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుందన్న అపోహలను, దుష్ప్రచారాలను అనురాగ్ శర్మ పటాపంచలు చేశారని కొనియాడారు. రాష్ట్రాన్ని సహనశీలంగా మార్చిన ఘనత ఆయకే దక్కుతుందని పేర్కొన్నారు.

నంబర్ వన్ పోలీసింగ్ వ్యవస్థ

నంబర్ వన్ పోలీసింగ్ వ్యవస్థ

అనురాగ్ శర్మ పర్యవేక్షణలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ పోలీసింగ్ వ్యవస్థగా నిలిచిందన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దిన వ్యక్తి అనురాగ్ శర్మ అన్నారు. శాంతిభద్రతల నిర్వహణ నిరంతర ప్రక్రియ అని, తెలివి-సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు.

ఎన్నో కొత్త విధానాలు

ఎన్నో కొత్త విధానాలు

తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ అన్నారు. తక్కువ కాలంలోనే ఎన్నో కొత్త విధానాలను ఇక్కడి పోలీసులు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. షీ టీమ్స్ ఏర్పాటు చేయడంతో, నగరంలో లక్షకు పైగా సీసీ కెమెరాల ఏర్పాటులో, కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగంలో ప్రశంసనీయ పాత్ర పోషించారన్నారు. స్వచ్చ హైదరాబాద్, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాల్లో సామాజిక బాధ్యతనూ నెరవేర్చారని చెప్పారు.

చరిత్రలో అలాంటి సందర్భం లేదు

చరిత్రలో అలాంటి సందర్భం లేదు

గోదావరి, కృష్ణా పుష్కరాల నిర్వహణలో పోలీస్ వ్యవస్థ పాత్ర గొప్పగా ఉందన్నారు. డీజీపీగా అనురాగ్ శర్మ అందించిన నాయకత్వం, సమన్వయం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. గత మూడున్నరేళ్లలో తెలంగాణ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలీసుల పనితీరును కూడా చూసి ఓటేయాలన్నామని గుర్తుచేశారు. చరిత్రలో ఇలాంటి సందర్భం లేదన్నారు.

కేసీఆర్ విజన్ గొప్పది

కేసీఆర్ విజన్ గొప్పది

ప్రభుత్వ సన్మానం పట్ల అనురాగ్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఏ డీజీపీకి ఈ స్థాయిలో వీడ్కోలు జరగలేదని, దీనిని పోలీస్ శాఖకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించడం సంతృప్తిని ఇస్తోందన్నారు. ఇక సీఎం కేసీఆర్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన విజన్ అందరి కన్నా గొప్పదన్నారు. దేవంలోనే తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు.

English summary
Telangana govt arranged a farewell meeting to retired DGP Sri Anurag Sharma on Tuesday at Pragati Bhavan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X