వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రమే: బ్రెగ్జిట్‌పై తెలుగు ఎన్నారైల మనోగతం

By Pratap
|
Google Oneindia TeluguNews

యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి విడిపోవాలంటూ బ్రిటన్ ప్రజలు ఓటేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇది తీవ్ర సంచలనం సృష్టించింది. దానివల్ల ప్రవాస భారతీయులకు కష్టాలు తప్పవనే వార్తలు వస్తున్నాయి. ఖర్చులు తడిసిమోపెడై వారి జీవితాలు భారంగా మారుతాయనే ప్రచారం సాగుతోంది. ఈ స్థితిలో కొంత మంది తెలుగు ఎన్నారైలు బ్రెగ్జిట్‌పై తమ అభిప్రాయాలను ఒన్ ఇండియా తెలుగుతో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

brexit

ప్రస్తుతానికి ఒత్తిడి లేదు, భవిష్యత్తు గురించి వేచి చూడాలి...

ఈయూ నుంచి బ్రిటన్ ఔట్: విడిపోదామన్న మెజార్టీ ప్రజలు, ట్రేడింగ్ నిలిపివేసిన జపాన్

బ్రెక్సిట్ పరిణామం బ్రిటన్ రాజకీయం మీద తీవ్రంగా పడింది , బ్రిటన్ పాలక పక్షం కన్సర్వేటివ్ పార్టీ, ప్రతిపక్ష లేబర్ పార్టీ రెండు సంక్షోభంలో ఉన్నాయి. ప్రధాన మంత్రి డేవిడ్ క్యామరాన్ రాజీనామా, ప్రతిపక్ష నేత జెరిమీ కార్బిన్‌పై లేబర్ పార్టీ లో అవిశ్వాస తీర్మానానికి దారి తీసాయి.

anil

బ్రెగ్జిట్: ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడానికి ప్రధాన కారణాలివే

ప్రపంచ స్థాయి ఆర్ధిక సంస్థలు ఊహించినట్టు గానే బ్రెక్సిట్ మార్కెట్ల పతనానికి దారి తీసింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు కుంగిపోయాయి. బ్రిటన్ ఆర్ధిక మాంద్యం వైపు పరుగులు తీస్తుండొచ్చు అని ఆర్ధిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. శుక్రవారం పౌండ్ విలువ డాలర్ తో పోల్చుకుంటే ఒక సమయం లో 1985 లో ఉన్న స్థాయికి చేరుకుంది. ఇతరలు బావిస్తునట్టు నిజానికి సామాన్యుల పై ప్రస్తుతం ఎటువంటి ఆర్థిక ఒత్తిడి లేదు, నిత్యావసర వస్తువులు తదితర, కాకపోతే భవిష్యత్తులో ప్రభావం ఉండొచ్చు, దీర్ఘ కాలిక పరిణామాలు ఎలా ఉంటాయో మాత్రం వేచి చూడాల్సిందే.

అనిల్ కూర్మాచలం
- ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF) వ్యవస్థాపక సభ్యుడు

స్కాట్లాండు వేర్పాటువాదానికి ఊతం

అనుకున్నట్టు గానే బ్రెక్సిట్ పరిణామాలు బ్రిటన్ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల మీద తీవ్రంగా పడింది. ఆర్థిక, రాజకీయ, రాజ్యంగ సంక్షోభం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మార్కెట్ల పతనం, రాజకీయ పార్టీలలో సంక్షోభం, స్కాట్‌ల్యాండ్ వేర్పాటు వాదం ఊపు అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కాట్‌ల్యాండ్ ఫస్ట్ మిన్స్‌టర్ నికోలా స్టర్జన్ స్కాట్‌ల్యాండ్ పార్లిమెంట్ వీటో ద్వారా బ్రెక్సిట్ కాకుండా చూస్తానని అన్న సందర్బంలో రాజకీయ సంక్షోభానికి దారి తీస్తుందా అనే ప్రశ్నలు తలెత్టుతుతున్నాయి. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయనేది భవిష్యత్తు చెప్పాల్సిందే.

uday

ఉదయ్ నాగరాజు
- సలహామండలి సభ్యుడు, బ్రిటిష్ సౌత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కామెర్స్ (BSICC), తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TENF)

పౌండ్ పతనం: బ్రిటన్‌లోని ఎన్నారైలకు ఫుడ్ కష్టాలు

ఎన్నారైలు అయోమయానికి గురయ్యారు..

ముఖ్యంగా ఇక్కడ ఎన్నారైలు కొంత అయోమయ పరిస్థితి కి గురయ్యారన్నది వాస్తవం, ముఖ్యంగా ఐటీ రంగం, సర్వీసెస్ రంగం లో పని చేస్తున్న వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎన్నో కలలతో యూకే వచ్చినవారిని ఇలాంటి పరిస్థితులు కొంత నిరుత్సాహ పరిచాయి. నిత్యావసర ధరలు కొంత మేరకు పెరిగాయి, అంతే కానీ సాధారణ జీవనంపై ప్రభావం ప్రస్తుతం భయపడినంత లేదు, భవిష్యత్తు లో మాత్రం ఖచ్చితంగా పెను మార్పులుండొచ్చని ఆర్థిక నిపుణుల విశ్లేషణ తో తెలుస్తుంది, ఇక వేచి చూడాలి.

gampa

- గంప వేణు గోపాల్ , వ్యాపారవేత్త & తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF) వ్యవస్థాపక సభ్యుడు

యూరోప్ నుండి ఇంగ్లాండ్ రెఫరండం తెలిసిన రోజు దాదాపు ప్రముఖ ఇళ్ల నిర్మాణ సంస్థలు షేర్ వాల్యూఏ 25% పడిపోయినవి. రెఫరెండం తర్వాత పౌండ్ విలువ మూడు దశాబ్దాల కనిష్ఠస్థాయికి పడిపోగా, బంగారం ధర పెరిగినది
ఇళ్ల ధరలు లండన్‌లో దాదాపు గరిష్ట ధర లో 5% తక్కువకు అమ్ముడుపోతున్నాయి నిత్యావసరాల వస్తువుల ధరలు ఇంకో వారం లోపు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఉన్న మెగా స్టోర్స్ ఒక వారానికి సరిపడా స్టాక్ ఉంటుంది

sikka

సిక్క చంద్ర శేఖర్ గౌడ్, అధ్యక్షుడు TeNF

English summary
Telugu NRIs expressed their opinion on Brexit. They feel major changes may take place in future in Britaion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X