• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాస్తవికత: మానవత్వాన్ని మెల్కొలిపిన అంధత్వం

|

బెంగళూరు: వారికి కుల, మత భేదాలు లేవు. పేద, ధనిక అన్న తేడా కూడా లేదు. వారంతా ఒక్కటే. వారంతా వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చినా ఎలాంటి భేద భావం లేకుండా కలిసే జీవిస్తున్నారు. అదే అందర్నీ ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు చెప్పిదంతా ఒక అంధ పాఠశాల గురించి. అందులోని పిల్లల గురించి. వారిలో ఒకరికి మంచి గ్రేడ్ వచ్చిందని, కొందరు పొడవుగా ఉన్నారని, మరి కొందరి తల్లిదండ్రులు ధనిక వారనే భావన లేదు. వారందరూ ఏ గురువునైనా, విద్యార్థినైనా సమానంగా గౌరవిస్తారు. నిజం చెప్పాలంటే.. మనమంతా కూడా అంతే కదా.

గత రెండు నెలల్లో నేను స్వచ్ఛందంగా వారంలో ఐదురోజులపాటు ఆ అంధ పాఠశాలను సందర్శించాను. కాగా, నెలకోసారి ఆ పాఠశాలలోని విద్యార్థులను దగ్గరలోని హెరిటేజ్ సైట్‌కి తీసుకెళ్తారు. ఈసారి మాత్రం ఆ విద్యార్థులను లాల్‌బాగ్ గార్డెన్స్‌కు తీసుకెళ్లారు. ఇక్కడ వారెంతో ఆనందంగా గడిపారు. వారిని ఎక్కడికి తీసుకెళ్లామనేది వారికి అవసరం లేదు. వారిని గ్యాస్ స్టేషన్‌కు తీసుకెళ్లినా వారు అక్కడ ఎంతో సంతోషంగా గడుపుతారు.

The Blind Make Us Human, a true experience

అయితే, లాల్‌బాగ్ సందర్శన ఎంతో సరదాగా సాగింది వారికి. ఆ రోజంతా ఎంతో ఆనందంగా గడిపారు. వ్యాన్‌లో వెళుతున్నప్పుడు వారు చేతులను బయటికి పెట్టి రోడ్డుపై వెళ్తున్న కార్లలో వెళుతున్న వారికి హలో చెప్పారు. ఓ చిన్నారు తన నాలుక బయటపెట్టాడు. కానీ, పొగ వాసన రాగనే ఆపేశాడు.

40ఎకరాల్లో విస్తరించిన లాల్‌బాగ్ గార్డెన్స్‌లో అనేక రకాల పూల బెడ్లు, పెద్ద చెట్లు వారిని ఆకట్టుకున్నాయి. ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉన్న గార్డెన్స్ నుంచి దక్షిణ బెంగళూరును చూడొచ్చు. దాన్ని మేమంతా ఎక్కాలని నిర్ణయించుకున్నాం.

లాల్‌బాగ్ వద్ద వ్యాన్ నుంచి దిగుతున్న సమయంలో ఆహార పదార్థాలు అమ్మేవారు ఉన్నారు. పిల్లల కోసం స్నాక్స్ తీసుకోండని కోరారు. అయితే లోపల భోజన ఏర్పాట్లు చేశారని అబద్దం చెప్పి అక్కడ్నుంచి వచ్చేశాం. అక్కడ్నుంచి కొంత కష్టపడి పైకి ఎక్కేశాం. పిల్లలంతా ఒకరినొకరు పట్టుకుని ఎక్కారు. అక్కడ గాలి పటాలను ఎగరవేయడాన్ని పిల్లలు ఎంతో ఇష్టపడ్డారు. ఆరుగురితో కూడిన సమూహంతో నేను పర్వతం పైకి వరకు వెళ్లాము.

మంటప పైభాగానికి రావడానికి పిల్లలకు సహాయం నేను సాయం చేశాను. అందులో ఒక బాలుడు అక్కడ ప్రాంతం ఎంత ఆందంగా వివరించమన్నాడు. అంతేగాక, అక్కడ్నుంచి అతని ఇల్లు కనబడుతుందా? అని అడిగాడు. నేను అతడ్ని అడిగితే అదెంతో పెద్దగా, చాలా దూరంలో ఉందని చెప్పాడు.

The Blind Make Us Human, a true experience

పర్వతం నుంచి దిగుతున్న సమయంలో నా గ్రూపులోని ఆరుగురు చిన్నారులు కొంత అలసటకు గురైనట్లు ఉన్నారు. ఎక్కేటప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు కొంత తగ్గింది. పర్వతం చుట్టూ వారంతా తిరిగారు. ఒక బాలిక కిందపడటంతో వారంతా ఆగిపోయారు. వారందరికి పర్వతం ఎక్కడం ఇదే తొలిసారి. వారందరూ తొందరగా దిగుతుంటే నేను వారిని నెమ్మదిగా వెళ్లమని చెప్పాను. వారందరిని విజయవంతంగా కిందికి తీసుకొచ్చా.

తిరిగి వారందరూ వ్యాన్‌లో ఎక్కుతున్న సమయంలో కొందరు ఫొటోగ్రాఫర్లు గార్డెన్‌లోకి వస్తున్న వారికి ఫొటోలను అమ్ముతున్నారు. అతను చాలా శ్రద్ధగా మమ్మల్ని గమనించాడు. అంతేగాక, అతను రూ. 200 ఇచ్చి మాటరాకుండా చేశాడు. ఎందుకు డబ్బులిచ్చావని ప్రశ్నించగా.. వారికి డబ్బుల రూపంలో కాకుండా ఏ విధంగా సహాయం చేయాలో తెలియలేదని చెప్పాడు. అతడు ఒకరోజు కష్టపడితే రూ.1000 సంపాదిస్తాడు. అందులోనుంచి ఈ మొత్తం పిల్లల కోసం ఇచ్చేశాడు. ఆ తర్వాత ఫొటో తీశాడు. నేనొక వాలంటీర్‌ను ఆ రూ. 200 అక్కడికి వచ్చిన అంధ ఉపాధ్యాయురాలికి ఇవ్వండని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాను. ఆ తర్వాత పిల్లలందరికీ ఐస్ క్రీం అందజేశాం.

The Blind Make Us Human, a true experience

అయితే, మొదట టీచర్ వారందరికీ ఐస్ క్రీం కొనిచ్చారని అనుకున్నా.. కానీ ఐస్ క్రీం అమ్మే అతను పిల్లలందరికీ ఉచితంగా అందజేశాడని తర్వాత తెలుసుకున్నా. చాలా మంది అమ్మకందారులు పిల్లల కోసం డిస్కౌంట్ చేసి అందించడాన్ని గమనించాను. అలాంటి వారి వద్ద ప్రజలు డిస్కౌంట్ అడగవద్దని అనుకున్నా. అంతమందికి ఐస్ క్రీంలు కొంటే సుమారు రూ. 1450 అయ్యుండేది. కానీ అతడు పూర్తిగా ఉచితంగా అందజేశాడు.

అంధులు మనలా ప్రపంచాన్ని చూడలేరు కానీ, వారి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చని తెలుసుకున్నా. అంధుల ప్రవర్తన అనుభవాలు నన్నెంతగానో ప్రభావితం చేశాయి. వారి పట్ల ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలందరూ ప్రవర్తించిన తీరులో చాలా వ్యత్యాసం కనిపించింది. అంధులు మనుషుల్లో మానత్వాన్ని మెల్కొలిపారని చెప్పవచ్చు.

- దివ్య కె

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The blind school is a place where one can find a group of people from various economic backgrounds, from various conditions and various states coming together for something that affects them all.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more