తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కమనీయం: బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి అంకురార్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం ధ్వజారోహణంతో పూర్తిస్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

తొమ్మిది రోజులు పాటు జరుగనున్న బ్రహ్మోత్సవ వేడుకలకు తిరుమలను శోభాయమానంగా అలంకరించారు.

శ్రీవారి ఆలయంతోపాటు తిరుమల మొత్తం విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారి బ్రహ్మోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమమైన ధ్వజారోహణం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ఈ నెల 24 వరకు ఉదయం, రాత్రి వివిధ వాహనసేవలు జరుగుతాయి. మాడవీధుల్లో ఊరేగే శ్రీవారిని తిలకించేందుకు అనువుగా గ్యాలరీలను సైతం రూపొందించారు. ఈ రోజు జరగనున్న ధ్వజారోహణం కార్యక్రమం తర్వాత వాహన మండపం వద్దకు చేరుకుని తిరుమలేశుని పెద్ద శేష వాహనసేవలో పాల్గొంటారు.

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ధ్వజారోహణం తర్వాత స్వామివారికి జరిగే తొలి వాహన సేవ పెద్దశేష వాహన సేవ. రాత్రి 9గంటలకు ప్రారంభమయ్యే ఈ సేవ రాత్రి 11గంటల వరకు జరుగుతుంది. కాగా స్వామివారి బ్రహ్మోత్సవాలకు టిటిడి భారీ భద్రతా చర్యలు తీసుకుంది. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు, వీఐపీలు పెద్దసంఖ్యలో తరలివస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టిటిడి భారీ చర్యలు చేపట్టింది.

 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం, బీజావాహనం జరిగింది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం, బీజావాహనం అత్యంత ముఖ్యమైనవి. బ్రహ్మోత్సవాలకు ముందు అంకురార్పణ నిర్వహించడం ఆనవాయితీ. ముందుగా శ్రీవారి సేనాపతి అయితే విష్వక్సేనుని విగ్రహాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు.

 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

అనంతరం నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి చేరుకుని భూమి పూజ, మృత్స్యంగ్రహణం చేసి ప్రదక్షణంగా ఆలయంలోకి ప్రవేశించారు. అంకురార్పణమంటే విత్తనం మొలకెత్తడం. ఇందులో అంతరార్థం ఏమిటంటే ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు స్వామివారిని కోరుతూ సంకల్పించడం.

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

మొక్కలకు అది దేవత చంద్రుడు కాబట్టి రాత్రి వేళల్లోనే విత్తనం నాటుతారు. ఆగమాల ప్రకారం విత్తనం బాగా మొలకెత్తడాన్ని ఉత్సవం విజయవంతానికి సూచికగా భావిస్తారు. పాలికలు అనే పాత్రలను విత్తనాలను నాటేందుకు వినియోగిస్తారు.

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మపీఠాన్ని బియ్యం తదితరాలతో అలంకరించిన తరువాత బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శాంత, ఇంద్ర, ఇనాస, జయ తదితర దేవతలను ఆహ్వానించి అగ్ని ద్వారా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం విష్ణు సూక్తాని పారాయణం చేస్తారు.

 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

విత్తనాలునాటే సమయంలో వరుణమంత్రాన్ని పఠించి నీళ్లు చల్లుతారు. ఈకార్యక్రమంలో టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇ ఒ సాంబశివరావు, జె ఇ ఓ శ్రీనివాసరాజు, సి వి ఎస్ ఓ నాగేంద్రకుమార్, డిప్యూటి ఇ ఓ చిన్నంగారి రమణ తదితరులు పాల్గొన్నారు.

 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4500 మంది పోలీస్ సిబ్బందిని, గరుడ సేవనాడు అదనంగా 1500 మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. వీరే కాకుండా టిటిడి నుంచి 2800 మంది సిబ్బందితోపాటు ఎస్పీఎఫ్, హోం గార్డు, గ్రేహైండ్స్, ఆక్టోపస్ దళాలను శ్రీవారి భక్తుల సేవకు సిద్ధంగా ఉన్నారు.

 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

అలాగే తిరుమల్లోని వివిధ ప్రాంతాల్లో 1500లకు పైగా సిసి కెమెరాలను ఏర్పాటుచేశారు. వీటిని తిరుమల్లోని సెంట్రల్ కమాండ్ పాయింట్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్, రెస్క్యూ,క్రైం టీలను వేర్వేరుగా ఏర్పాటుచేశారు. కాగా బుధవారం సాయంత్రం తిరుమలకు సిఎం, గురువారం రాష్ట్ర గవర్నర్ వస్తుండటంతో తిరుమల్లో భద్రతను మరింత పటిష్టం చేశారు.

 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

అలిపిరి ఘాట్ వద్ద నుంచి భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎస్ పి ఎఫ్ దళాలు, డ్వాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తిరుమల ఘాట్ రోడ్డులను జల్లెపడుతున్నాయి.

English summary
The annual Brahmotsavams of Lord Venkateswara at Tirumala has been flagged off with ceremonious Ankurarpanam or beejavapanam festival which is considered to be one of the most important rituals of the Vaikhanasa Agama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X