వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండుతున్న భానుడు: ఈసారీ భగభగలే, ఎలానో...

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ‌: వచ్చే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపనున్నాడు. ఆదివారం నుంచి సాధారణస్థాయి కంటే రెండు, మూడు డిగ్రీల సెల్సియస్‌ అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వివరించింది.

ఆదివారం మాత్రం ఎండ తీవ్రతతోపాటు కొన్నిచోట్ల వడగళ్లు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. కాగా, శనివారం అత్యధికంగా రామగుండంలో 42.4 డిగ్రీలు సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 41.4 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 41 డిగ్రీలు, ఖమ్మంలో 40.6 డిగ్రీలు, నిజామాబాద్‌లో 40.6 డిగ్రీలు, నల్లగొండలో 40.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 39.8 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

ఏప్రిల్‌ నెలలో అడుగుపెట్టి పట్టుమని పది రోజులు కూడా కాకముందే దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పటికే ఎండల తీవ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ దాటి పోయింది. మే నెలల్లో ఎండలు మరెంత భగ్గుమంటాయో అన్న ఆందోళన అప్పడే ప్రజలను పిండేస్తున్నది.

ఎండ తీవ్రత ఎంత ఎక్కువ ఉంటే ఆ తర్వాత అంత ఎక్కువ వర్షాలు పడతాయని ప్రజలు భావిస్తారు. కానీ అది అన్ని కాలాల్లో నిజం కాదని అనుభవ పూర్వకంగా తెలుస్తున్నది. భారత ప్రభుత్వ వాతావరణ శాఖ ఈ సారి వర్షాలు ఎలా ఉంటాయో ఇప్పటికీ చెప్పకున్నా సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురుస్తాయని ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థలు తేల్చేశాయి.

పాలకులకు పట్టని సామాన్యుల గోడు

పాలకులకు పట్టని సామాన్యుల గోడు

ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కరవు పరిస్థితులు తాండవిస్తుండటంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతూ తమిళనాడు రైతులు దేశ రాజధాని ‘హస్తిన'లో దద్దరిల్లేలా నిరసన వ్యక్తం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం తోసిరాజన్నట్లు వ్యవహరిస్తోంది. దేశంలో కరవు పరిస్థితులు నెలకొన్నప్పుడల్లా ఆ నెపాన్ని అనూహ్య వాతావరణ పరిస్థితులపైకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెట్టేస్తున్నాయి. అందుకు భూతాపోన్నతి కారణమంటూ ఓ భూతాన్ని చూపిస్తున్నాయి. భూతాపానికి ఎవరు కారణం ? దాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటీ? భూతాపం పెరిగినా కరవు పరిస్థితుల ప్రభావం ఉండకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలేమిటీ? ఏనాడైనా ఆలోచించాయా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అడుగంటుతున్న జలాశయాలు

అడుగంటుతున్న జలాశయాలు

గతనెలాఖరు నాటికి కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో ఉన్న 91 శాతం పెద్ద రిజర్వాయర్లలో నీటి నిల్వలు 52,63,200 కోట్ల క్యూబిక్‌ మీటర్లకు పడిపోయింది. మొత్తం రిజర్వాయర్ల సామర్థ్యంలో 33 శాతానికి పడిపోయింది. నీటి పొదుపునకు కేంద్ర జల సంఘం ఇప్పటికే అత్యవసర చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ సూచనలేవి కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో అనేక రాష్ట్రాలు రక్షిత మంచినీటి కోసం తల్లడిల్లుతున్నాయి. సమస్య వచ్చే వరకు కదలక పోవడం అనే జాడ్యం పార్టీలకతీతంగా ప్రభుత్వాలకు పాకడంతోనే దేశంలో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

సాగునీటి వసతుల పెంపుదలకు చర్యలేవి

సాగునీటి వసతుల పెంపుదలకు చర్యలేవి

దేశంలో సగానికి సగం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నా.. వ్యవసాయ ఉత్పత్తులు జాతీయ స్థూల ఉత్పత్తిలో 12 శాతం మాత్రమే ఉందంటే ప్రభుత్వానిదే తప్పని స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. పాలకులు నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, తప్పనిసరిగా ప్రతి రైతు భూగర్భ జలాల రక్షణకు చర్యలు తీసుకోవాలనే నిబంధనలు అమలయ్యేలా చూసే వారే కరువయ్యారు.

మొత్తం రైతుల్లో 61 శాతం రైతులు ఇప్పటికీ వర్షాధార పంటలపైనే ఆధారపడటానికి ప్రభుత్వాలు అనుసరించే విధానాలే కారణమన్న విమర్శలు ఉన్నాయి. అళ్వార్‌లోని తరుణ్‌ భారత్‌ సంఘ్, పుణెలోని వాటర్‌షెడ్‌ ఆర్గనైజేషన్‌ ట్రస్ట్, చండీగఢ్‌ శివారులోని సుఖోమజిరి, మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్ధి ఎన్జీవో సంస్థలు జల వనరుల అభివద్ధికి చర్యలు తీసుకొని ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నా మన పాలకులు మాత్రం నిద్ర లేవరెందుకు? చెట్టూ పుట్ట, చేను పచ్చగా ఉన్నప్పుడే భూతాపం తగ్గుతుందని, పర్యవసానంగా ఎండల తీవ్రత ఎక్కువ ఉండదన్న విషయం మన పాలకులకు తెలియదా? అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాగునీటి సరఫరాకు మెరుగైన చర్యలిలా

తాగునీటి సరఫరాకు మెరుగైన చర్యలిలా

కనీసం వచ్చే నెల ప్రజలకు తాగునీటిని అందించి ప్రాణాలను నిలిపేందుకు అహ్మదాబాద్‌ మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకోనైనా అన్ని మున్సిపాలిటీలు సత్వర చర్యలు చేపట్టాలి. 2010 నుంచి 2015 మధ్య అక్కడి స్థానిక ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన 'అహ్మదాబాద్‌ హీట్‌ యాక్షన్‌ ప్లాన్' వల్ల వేసవి కాలంలో వందల సంఖ్యలో సంభవించే మరణాలు పదుల సంఖ్యకు తగ్గాయి. 2015లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో వేసవి గాలులకు దాదాపు రెండున్నర వేల మంది మరణించారు.

English summary
Today on wards another two days will be heat weather in Telangana. Day temperatures will be hit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X