వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంతకష్టం: అమెరికాలో ఇలా 20 లక్షల ఉద్యోగాలు హాంఫట్!

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయా? చైనా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా అధికంగా సుంకాలు విధించడంతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు శ్వేత సౌధాధిపతి.

ఆ సుంకం జాతీయ భద్రతా కారణాలతో వేశామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాణిజ్య లోటుతో అమెరికా 20లక్షల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని వైట్‌ హౌస్‌ వర్గాలు చెబుతూ అధ్యక్షుడి నిర్ణయాన్ని వెనకేసుకొచ్చాయి.

ప్రతిగా చైనా మూడు బిలియన్ డాలర్ల దిగుమతి సుంకం విధింపు

ప్రతిగా చైనా మూడు బిలియన్ డాలర్ల దిగుమతి సుంకం విధింపు

చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 60 బిలియన్‌ డాలర్ల సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్‌ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చైనా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అమెరికా ఉత్పత్తులపై మూడు బిలియన్‌ డాలర్ల సుంకాలను విధించింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

 చైనాలో 20 లక్షల ఉద్యోగాలు.. అదేస్థాయిలో అమెరికన్లకు ముప్పు

చైనాలో 20 లక్షల ఉద్యోగాలు.. అదేస్థాయిలో అమెరికన్లకు ముప్పు

ఈ నేపథ్యంలో శ్వేత సౌధంలోని సీనియర్‌ అధికారి విలేకరులతో మాట్లాడుతూ.. ‘వాణిజ్య లోటు ఎలా ఉంటుందంటే ప్రతి బిలియన్‌ డాలర్‌కు 6000 ఉద్యోగాలు పోతాయి. చైనాలో మొత్తంగా అదనంగా రెండు మిలియన్ల మంది ఉపాధి పొందనుండగా, అమెరికాలో అంతే మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది' అని అన్నారు.

 375 బిలియన్ల డాలర్లు దాటిన చైనాతో అమెరికా వాణిజ్యలోటు

375 బిలియన్ల డాలర్లు దాటిన చైనాతో అమెరికా వాణిజ్యలోటు

చైనాకు అమెరికా ఎగుమతుల విలువ 130 బిలియన్‌ డాలర్లు, ఇక చైనా నుంచి అమెరికా చేసుకునే దిగుమతుల విలువ 506 బిలియన్‌ డాలర్లు. చైనాతో అమెరికా వాణిజ్యలోటు 375 బిలియన్‌ డాలర్లు దాటిపోయింది. వాణిజ్యలోటు ఇంత భారీ స్థాయిలో ఉండటం సమంజసం కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాదిస్తున్నారు. వాణిజ్యలోటును తగ్గించుకోవడం అమెరికాకు అసాధ్యం. చైనా నుంచి ఇబ్బడిముబ్బడిగా వస్తువులు అమెరికాకు దిగుమతి అవుతున్నాయి. అందుకే అమెరికా నష్టాల్లోకి జారిపోయింది.

 డబ్ల్యూటీవో నిబంధనలను తుంగలో తొక్కిన అమెరికా

డబ్ల్యూటీవో నిబంధనలను తుంగలో తొక్కిన అమెరికా

ఆధిపత్యం సాధించడం కోసం ట్రంప్‌ అన్ని దారులు వెతుకుతున్నారు. ఇందులో భాగంగానే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలను సైతం తుంగలో తొక్కి సుంకాల జాతరకు తెర తీశారు. అనుకున్నదే తడవుగా 60 బిలియన్‌ డాలర్ల సుంకాలను విధించారు. మొత్తం 1300 వస్తువులను ఈ జాబితాలోకి తేవడం ద్వారా, చైనా వస్తువులకు అడ్డు కట్టవేయాలన్నది ట్రంప్‌ ఆలోచన. ఆ వస్తువులు ఏంటనేది ఇంకా ఖరారు చేయలేదు.

 చైనా బ్లాక్ మెయిల్ అడ్డుకుంటామన్న సెనెటర్ రాన్ వెడెన్

చైనా బ్లాక్ మెయిల్ అడ్డుకుంటామన్న సెనెటర్ రాన్ వెడెన్

‘దశాబ్దాలుగా అమెరికన్‌ పరిశ్రమలను, వాణిజ్యాన్ని చైనా మోసం చేస్తోంది. దీంతో కార్మికులు ఆర్థికంగా చితికిపోతున్నారు. చైనా చేసే ట్రేడ్‌ బ్లాక్‌మెయిల్‌కు మా దేశం గట్టిగా ఎదురు నిలబడుతుంది. అంతేకాదు చైనా నుంచి దిగుమతి అయ్యే టెక్నాలజీని, ఇబ్బడి ముబ్బడిగా వచ్చే వస్తువులను నిరోధించేందుకు కృత నిశ్చయంతో ఉంది' అని అమెరికన్‌ సెనేట్‌ ఫైనాన్స్‌ కమిటీ ర్యాంకింగ్‌ మెంబర్‌ రాన్‌ వేడెన్‌ ధ్వజమెత్తారు.

 ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికా పరిశ్రమ వర్గాలు

ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికా పరిశ్రమ వర్గాలు

చైనాపై సుంకాలు విధించడానికి ట్రంప్‌ సర్కార్‌కు కనిపించిన ప్రధాన కారణం.. 375 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు. దీని వల్ల తమ దేశంలో 20 లక్షల ఉద్యోగాలు పోతాయని చెబుతోంది. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాలోని రైతులు, పరిశ్రమ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. సాధారణంగా అమెరికా చేసే ఎగుమతులే తక్కువ. వాటిపై చైనా సుంకాలు విధిస్తే మరింత భారం అవుతాయి. దీంతో విదేశీ వస్తువుల కొనుగోలు ఆగిపోతాయి. ఏయే వస్తువులపై సుంకాలు విధించాలో ఇంకా అమెరికా ఖరారు చేయలేదు.

 అమెరికా రక్షణాత్మక చర్యలతో ఆ దేశ రైతులకు అంతిమ నష్టం

అమెరికా రక్షణాత్మక చర్యలతో ఆ దేశ రైతులకు అంతిమ నష్టం

చైనా మాత్రం అమెరికాకు చెందిన 120 వస్తువులపై సుంకాలు విధిస్తున్నట్లు జాబితా విడుదల చేసింది. చైనాలో వీటి ధరలు పెరిగితే, విక్రయాలు పడిపోతాయి. దీని వల్ల అంతిమంగా నష్టపోయేది అమెరికా రైతులే. రక్షణాత్మక చర్యల వల్ల ప్రపంచ స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో అటు అగ్ర రాజ్యం అమెరికా, ఇటు చైనా దూకుడు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

English summary
WASHINGTON — President Donald Trump's decision to order some $50 billion in tariffs on a wide range of Chinese imports, despite the risk of setting off a wider trade war, met with bipartisan approval Thursday, reflecting the growing disillusionment with Beijing on the part of many American officials and business leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X