వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిట్ట కొంచెం కూత ఘనం: ఐదేళ్ల యూకెజీ నేహాల్ ఇదీ...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పిట్ట కొంచెం కూత ఘనమని నిరూపించాడు ఐదేళ్ల నేహాల్. యూకేజీ చదువుతున్నాడు. తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులపై నేహాల్ చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు.

నేహాల్ అద్భుత శక్తిగా తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో సహా అందరూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టుల గురించి అనర్గళంగా మాట్లాడాడు.

ఈ లెక్కలు కూడా అతను...

ఈ లెక్కలు కూడా అతను...

తెలంగాణ ప్రాజెక్టుల ఆయకట్టు ఎంత, వాటి వల్ల ప్రయోజనాలు ఏమిటి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దూరదృష్టి ఎటువంటిది వంటి పలు విషయాలపై అలవోకగా, అనర్గళంగా వివరిస్తున్నాడు.

ఏ ప్రాజెక్టు గురించి అయినా...

ఏ ప్రాజెక్టు గురించి అయినా...


కాళేశ్వరం ప్రాజెక్టు అినా, పాలమూరు - రంగారె్డి ప్రాజెక్టు అయినా.. ఏ ప్రాజెక్టు గురించైనా ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా వివరిస్తుంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.

బ్రాండ్ అంబాసిడర్‌గా నేహాల్..

బ్రాండ్ అంబాసిడర్‌గా నేహాల్..

నేహాల్ అద్భుత జ్ఞాపకశక్తికి, ప్రతిభకు మంత్రి హరీష్ రావు ఫిదా అయ్యారు. నేహాల్‌ను తెలంగాణ నీటి పారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తన్నట్లు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి కూడా హరీష్ పక్కన ఉన్నారు. వారిద్దరు నేహాల్‌ను అభినందించారు.

నేహాల్ తండ్రి చిరుద్యోగి

నేహాల్ తండ్రి చిరుద్యోగి

నేహాల్ ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందినవాడు. అతని తండ్రి హనుమంతరావు హైదరాబాదు షాపూర్ నగర్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడు. నేహాల్ ప్రతిభను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు ఆ విషయాన్ని హరీష్ రావు దృష్టికి తెచ్చారు.

వందలాది మంది ఇంజనీర్ల సమక్షంలో....

వందలాది మంది ఇంజనీర్ల సమక్షంలో....


హైదరాబాదులోని జలసౌధలో ఆదివారంనాడు వందలాది మంది నీటిపారుదల ఇంజనీర్ల సమక్షంలో నేహాల్ తన ప్రతిభను చాటి చెప్పాడు. నీటి ప్రాజెక్టులను కేసీఆర్ రీడిజైనింగ్ చేసిన తీరును, ఆయనను సూచనలను, ఆయన దూరదృష్టిని నేహాల్ 20 నిమిషాల పాటు వివరించాడు.

దాన్ని ఎందుకు మార్చారు...

దాన్ని ఎందుకు మార్చారు...


కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ పాయింట్‌కు ఎందుకు మార్చారనే విషయాన్ని మాత్రమే కాకుండా మహారాష్ట్ర అభ్యంతరాలను కూడా నేహాల్ వివరించాడు.

చదువు ఖర్చు ప్రభుత్వానిదే...

చదువు ఖర్చు ప్రభుత్వానిదే...

తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టు బ్రాండ్ అంబాసిడర్‌గా నేహాల్‌ను నియమిస్తున్న ప్రకటించిన హరీష్ రావు అతని చదువు ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలని ఉందని నేహల్ చెప్పాడు త్వరలోనే ఆ కోరికను నెరవేరుస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు.

English summary
A five year old UKG student Nehal has been appointed as Telangana irrigation projects brand ambassador by minister Harish Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X