• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోటీన్ కు భిన్నం, అందరికీ ఆదర్శంగా నిలిచిన జంటలు

By Narsimha
|

న్యూఢిల్లీ :తన పెళ్ళి గురించి పది మంది ఘనంగా చెప్పుకోవాలని ఎవరైనా కోరుకొంటారు.అయితే ఎంత ఎక్కువ ఖర్చు చేసి వివాహంయ జరిపిస్తే అంత గొప్పవాళ్ళుగా ముద్ర పడుతోంది.అయితే ఆర్భాటంగా వివాహం చేసుకొనేందుకు ఈ తరం యువత అంతగా ఆసక్తిని చూపడం లేద. తమ వివాహానికి అయ్యే ఖర్చును ఇతర అవసరాల కోసం ఉపయోగించి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇదే తరహలో వివాహం చేసుకొన్న జంటలు కొన్ని ఆదర్శంగా నిలిచాయి.

పెళ్ళంటే కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలని కోరుకొనే ఉంటారు.అయితే ఈ కోరికను కూడ వదులుకొని నిరాడంబరంగా వివాహం చేసుకొని కొందరు అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఈ ఏడాది చివరి మాసాల్లో పెద్ద నగదు నోట్ల రద్దు ప్రబావం కూడ వివాహలపై పడింది. వివాహలు ఆర్భాటంగా చేసుకోవాలని భావించినవారంతా పెద్ద నగదు నోట్లు రద్దు కారణంగా సాదాసీదాగా చేసుకొన్నారు.అంతేకాదు వచ్చిన అతిధులకు చాయ్ నీళ్ళతోనే సరిపెట్టారు.

ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు, వ్యాపార కుటుంబాల నుండి వచ్చినవారు కూడ వివాహలకు సంబందించి చాల నిరాడంబరంగా వ్యవహరించారు. వారి నిరాడంబరత కారణంగా వారంతా ఈ ఏడాది వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు.

భాజ భజంత్రీలు లేకుండానే వివాహం

భాజ భజంత్రీలు లేకుండానే వివాహం

మహరాష్ట్రకు చెందిన బ్యాంకు ఉద్యోగి ఒకరు తన వివాహన్ని సాదాసీదాగా చేసుకొన్నారు. మహరాష్ట్రలోని అభయ్ దేవరే , ముంబైలోని ఐడిబిఐ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తోన్న ప్రీతి కుంబారే ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. తన పెళ్ళికి అనవసరమైన ఖర్చు చేసే బదులు ఆ సొమ్మును ఆత్మహత్య చేసుకొన్న రైతుల కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు వారు నిరాడంబరంగా వివాహం చేసుకొన్నారు. ఆత్మహత్య చేసుకొన్న రైతుల కుటుంబాల పిల్లల చదువు కోసం ఈ ఖర్చునుఇచ్చారు. ఒక్కో రైతు కుటుంబానికి సుమారు 20 వేల రూపాయాలను వారు ఆర్థికసహయం చేశారు.పది కుటుంబాలను ఎంపిక చేసి ఆ కుటుంబాలకు 20 వేల చొప్పున ఈ చెక్కులను అందించారు. అమరావతిలోని ఐదు గ్రంధాలయాలకు 52 వేల రూపాయాల పుస్తకాలను కొనుగోలు చేసి ఇచ్చారు. అభయ్ ప్రస్తుతవం ఐఆర్ ఎస్ సర్వీస్ లో ఉన్నారు.

 మొక్కల పంపిణీ

మొక్కల పంపిణీ

బంగారానికి బదులుగా మొక్కలు కావాలని కోరుకొంది ఓ యువతి. మధ్య ప్రదేశ్ లోని కిసీపురాకు చెందిన పెళ్ళి కూతురు ప్రియాంక భడోరియా పెళ్ళిరోజున అబ్బాయి తరపు నుండి ఎలాంటి బంగారు ఆభరణాలను కోరుకోలేదు. ఈ ప్రాంతంలో అత్తింటివారు తమ ఇంటికి కోడలుగా వచ్చే యువతికి వారు కోరుకొన్న బంగారుఆభరణాలను ఇస్తారు.అయితే ఇదే విషయాన్ని ఆమెను అత్తింటివారు అడిగారు.అయితే తనకు ఎలాంటి బంగారు ఆభరణాలు అవసరం లేదని ఆమె తేల్చి చెప్పింది.అయితే తనకు బంగారు ఆభరణాలు అవసరం లేదని ఆమె తేల్చి చెప్పింది. తనకు మొక్కలు కావాలని కోరింది. అయితే పెళ్ళిరోజున ప్రియాంకకు పదివేల మొక్కలను బహుమానంగా ఇచ్చారు. అత్తింటివారు ఆమెకు ఏకంగా పదివేల మొక్కలను తీసుకొన్న బహుకరించారు.పెళ్ళి తర్వాత ఆమె తన భర్తతో కలిసి ఆ మొక్కలను ఆమె పలువురి ఇళ్ళళో నాటారు.

గురువులను సన్మానించిన కొత్త జంట

గురువులను సన్మానించిన కొత్త జంట

గుజరాత్ లోని హల్దార్ గ్రామానికి చెందిన నిషాబాద్ బాను వాజిఫ్ దార్ అనే యువతి నర్సరీ నుండి పిజీ వరకు తనకు విద్యాబోధన చేసిన టీచర్లను వివాహనికి పిలిపించి పెళ్ళిరోజున వారిని సన్మానించింది. పెళ్ళి పందిరిలోనే వారందరికీ శాలువాలు కలప్పి ఘనంగా సన్మానం చేసింది. తాను చదువుకొన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు పది లక్షల రూపాయాలను విరాళంగా ఇచ్చింది. నిరాడంబరంగా వివాహం చేసుకొని ఆ డబ్బును ఆమె స్కూల్ కోసం ఖర్చు విరాళంగా ఇచ్చింది.

ఐదువందలతో ఐఎఎస్ ల పెళ్ళి

ఐదువందలతో ఐఎఎస్ ల పెళ్ళి

మద్యప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు ఐఎఎస్ లు ఐదువందల రూపాయాలతో వివాహం చేసుకొన్నారు.మధ్యప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి ఆశిష్ వశిష్ట, ఆంద్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన సలోని సిదానా కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. ఆశిష్ రాజస్థాన్ రాష్ట్రం. సలోనిది పంజాబ్. నవంబర్ 28వ, తేదిన మధ్యప్రదేశ్ లో వీరిద్దరూ సాధాసీదాగా వివాహం చేసుకొన్నారు. కోర్టు ఫీజు ఐదువందల రూపాయాలు చెల్లించారు. ఈ ఫీజే వారు పెళ్ళి కోసం చేసిన ఖర్చు. 2013 బ్యాచ్ కు చెందిన వీరిద్దరూ ముస్సోరిలో శిక్షణ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆనాటి నుండి వీరిద్దరూ తమ ప్రేమను కొనసాగిస్తున్నారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బింద్ కోర్టులో తమ వివాహనికి అనుమతి ఇవ్వాలని వారు ధరఖాస్తు చేసుకొన్నారు. దీంతో వారికి నవంబర్ 28వ, తేది అనుమతి ఇచ్చింది.రెండు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో ఇద్దరు వివాహం చేసుకొన్నారు.వీరిద్దరూ పెళ్ళి చేసుకోవడంతో ఆంద్రప్రదేశ్ నుండి సలోని మధ్యప్రదేశ్ క్యాడర్ కు మారే అవకాశం దక్కింది.

 హిజ్రానే సాక్షిగా పెళ్ళి

హిజ్రానే సాక్షిగా పెళ్ళి

కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ లో కార్యకర్తలుగా పనిచేస్తోన్న రామ్ నాథ్ , శతిలు రిజిష్ట్రార్ ఆఫీసుకెళ్ళి నిరాడంబరంగా పెళ్ళిచేసుకొన్నారు. పెళ్ళికి హిజ్రాను సాక్షిగా పిలిపించి మరీ సంతకం చేయించుకొన్నారు. అంతే కాకుండా పెళ్ళికూతురు బంగారు నగలకు బదులుగా జౌళితో చేసిన నగలను ధరించారు. ఓ తండ్రి తన కన్నకూతురి వివాహం కోసం దాచుకొన్న డబ్బును పేద పిల్లల కోసం ఖర్చుచేసి తన కూతురు వివాహన్ని నిరాడంబరంగా జరిపించడం విశేషం. తన కూతురు పెళ్ళికి నగరంలోని వితంతువులందరినీ పిలిపించారు.

ప్రకృతి ప్రేమికుల పెళ్ళిలో ప్రకృతి రక్షణ

ప్రకృతి ప్రేమికుల పెళ్ళిలో ప్రకృతి రక్షణ

కార్తీక్ కష్ణన్, శాశ్వతి శివ ఇద్దరూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కారులు. వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆరుమాసాల క్రితం ఇద్దరు వివాహం చేసుకొన్నారు. అయితే తమ వివాహం సందర్భంగా ఎక్కడా కూడ ప్లాస్టిక్ ను వాడలేదు. పాలకు, కూల్ డ్రింకులకు బదులుగా కొబ్బరిబొండాలను ఏర్పాటుచేశారు. మాంసాహరం జోలికి వెళ్ళలేదు. కూరగాయల భోజనంతో అతిధులకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ పెళ్ళికి తమ పెంపుడు జంతువులతో రావాలని వారు అతిథులను ఆహ్వనించారు.

 పేదలకు ఇళ్ళు ఇచ్చిన వధువు.

పేదలకు ఇళ్ళు ఇచ్చిన వధువు.

తన వివాహం కోసం చేసే ఖర్చును పేదలకు ప్రయోజనం కల్గించే కార్యక్రమం చేయాలని ఓ వధువు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు మహరాష్ట్రకు చెందిన శ్రేయ తన పెళ్ళి సందర్భంగా అయ్యే ఖర్చుతో 108 మంది పేదలకు ఇళ్ళు కట్టించి ఇచ్చారు. ఈ విషయాన్ని వరుడు తరపు కుటుంబ సభ్యులకు ముందు తెలిపారు. వారు కూడ వధువు నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో వివాహం రోజున వధువు శ్రేయ పేదలకు కొత్త ఇంటి తాళాలను అందించారు.

English summary
so,to wrap up the year on a good note, here are some wedding stories of young couples and their families who dared to fight stigmas and break stereotypes and helped others. they will rekindle your faith in humanity and leave you happy if not inspired.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X