హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖైరతాబాద్ గణపతి దర్శనం రేపు రాత్రి వరకే(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి వద్ద భక్తుల తాకిడి భారీగానే ఉంటోంది. ప్రతీ రోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, సోమవారం పలువురు ప్రముఖులు వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసభ్యులు, డీజీపీ అనురాగ్ శర్మ, మాజీ ఎంపీ వివేక్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.

 ఖైరతాబాద్ వినాయకుడు

ఖైరతాబాద్ వినాయకుడు

డీజీపీ అనురాగ్ శర్మకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గణేశ్ ఉత్సవకమిటీ చైర్మన్ సింగారి సుదర్శన్, ఉపాధ్యక్షుడు మహేశ్ యాదవ్, కన్వీనర్ సందీప్‌రాజ్, కార్యనిర్వహక కార్యదర్శి సింగారి రాజ్‌కుమార్ డీజీపీని శాలువాతో సత్కరించారు.

విద్యుత్ కాంతులతో..

విద్యుత్ కాంతులతో..

ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ గణేశుడి వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకోవాలని సూచించారు.

 బారులు తీరిన భక్తులు

బారులు తీరిన భక్తులు

అలాగే దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసభ్యులు, మాజీ ఎంపీ వివేక్ కుటుంబ సమేతంగా గణేశుడిని దర్శించుకున్నారు. వారి వెంట కార్పొరేటర్ విజయా రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు కేవీ ప్రసాద్ ఉన్నారు. కాగా, ఆదివారం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్వామివారిని దర్శించుకున్నారు.

బుధవారం రాత్రి వరకే దర్శనం

బుధవారం రాత్రి వరకే దర్శనం

ఖైరతాబాద్‌ మహా గణపతి చెంత భక్తులకు దర్శనం అవకాశం సెప్టెంబర్ 14వ తేదీ(బుధవారం) అర్ధరాత్రి వరకే ఉంటుంది. మహాగణపతిని తొలుతే నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

 15న నిమజ్జనం

15న నిమజ్జనం

14వ తేదీ అర్ధరాత్రి దాటాక 15వ తేదీలోకి అంటే అనంత చతుర్దశిలోకి చేరగానే ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం నిలిపివేస్తారు. ఆ తర్వాత మండపం కర్రల తొలగింపు, విగ్రహాన్ని వాహనం మీదకు చేర్చడం, వాహనానికి వెల్డింగ్‌ పనులు తదితరాలు ఉంటాయి.

 వినాయకుడి సేవలో..

వినాయకుడి సేవలో..

ఇవన్నీ 15వ తేదీ వేకువజాము వరకు పూర్తి చేసి.. ఉదయం 6 గంటల నుంచి శోభాయాత్ర మొదలు పెడతారు. మధ్యాహ్నం లోపు నిమజ్జనం పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

English summary
Union Minister M Venkaiah Naidu and Telangana State Irrigation Minister T Harish Rao visited Khairathabad Ganesh mandap on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X