హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేద విద్యార్ధుల కోసం: వీవీఎస్ లక్ష్మణ్ పిలుపు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నేటి బాలలే రేపటి పౌరులని, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ప్రాజెక్ట్‌ 511 ఆధ్వర్యంలో అక్టోబరు 9న నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో 'ఫుడ్‌ ఫర్‌ ఛేంజ్‌' ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

 ‘ఫుడ్‌ ఫర్‌ ఛేంజ్‌' ప్రాజెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ వీవీఎస్ లక్ష్మణ్

‘ఫుడ్‌ ఫర్‌ ఛేంజ్‌' ప్రాజెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ వీవీఎస్ లక్ష్మణ్


ఈ ప్రాజెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ వీవీఎస్ లక్ష్మణ్, సినీ నిర్మాత సురేష్‌బాబు, ప్రాజెక్ట్ 511 ఛైర్మన్ శ్రీనివాసన్ నామాల ఉన్నారు. ఇందులో భాగంగా అమీర్‌పేటలోని గ్రీన్‌పార్క్‌ మ్యారీగోల్డ్‌ హోటల్‌లో బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడారు.

పేద విద్యార్థులకు విద్యావసతుల కల్పనే లక్ష్యంగా

పేద విద్యార్థులకు విద్యావసతుల కల్పనే లక్ష్యంగా

ప్రాజెక్ట్ 511 ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు విద్యావసతుల కల్పన, విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తోందని అన్నారు. 15 ఏళ్ల నుంచి నగరంలోని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందుతోందన్నారు.
 ఇప్పటి వరకు 511 పాఠశాలలకు సహకారం

ఇప్పటి వరకు 511 పాఠశాలలకు సహకారం


ఈ కార్యక్రమం ప్రారంభంలో 511 పాఠశాలలకు సహకారం అందించగా, ప్రసుత్తం 1022 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ‘ఫుడ్‌ ఫర్‌ ఛేంజ్‌' నగరంలోని ప్రధాన హోటళ్లలో స్టాళ్లు ఏర్పాటు చేస్తాయని, వీటిలో 64 దేశీయ క్యూజిన్స్ వంటకాలు, 25 డిసెర్ట్స్, 9 రకాల విదేశీ డిష్‌లు అందుబాటులో ఉంటాయన్నారు.

 పేద పిల్లల చదువుకు దోహదపడాలి

పేద పిల్లల చదువుకు దోహదపడాలి


ఈ విందులో పాల్గొని పేద పిల్లల చదువుకు దోహదపడాలని ఈ సందర్భంగా వీవీఎస్ కోరారు. అనంతరం సినీ నిర్మాత డి. సురేష్‌బాబు మాట్లాడారు. ‘ఫుడ్‌ ఫర్‌ ఛేంజ్‌' కార్యక్రమం ద్వారా సమకూరిన డబ్బును స్కూళ్ల అభివృద్ధికి వెచ్చిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారికి నుంచి వసూలు చేసే టికెట్‌ ద్వారా నిధులను సమీకరిస్తామని తెలిపారు.

English summary
vvs laxman attend a programme for good for a change
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X