వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెమీస్‌లో గెలుపు భారత్‌దే: సేమ్ సీన్ రీపీట్?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: ఈసారి ఐసీసీ వరల్డ్ టీ20 కప్ భారత్‌దే అంటే అవుననే అంటున్నారు క్రీడా నిపుణులు. వరల్డ్ కప్‌కు ముందు టైటిల్ బరిలో ఫేవరేట్ జట్టు ఏదంటే అందరూ భారతే అని అన్నారు. ఎవరూ ఊహించిన విధంగా గ్రూప్ స్టేజి తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్‌కు పెద్ద షాక్ తగిలింది.

ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌లు కూడా భారత్‌కు పెద్ద పరీక్షే. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మూడు మ్యాచ్‌ల్లో కూడా టీమిండియా అభిమానుల ఆశలను వమ్ము చేయకుండా సెమీస్ బరిలో నిలిచింది. ఈ క్రమంలో ఆఖరి బంతి వరకూ పోరాడే తత్వం టీమిండియా విశ్వాసాన్ని మరింతగా పెంచింది.

'ఛేజ్ మాస్టర్': భారత్-ఆసీస్ మ్యాచ్‌లో కోహ్లీ రికార్డులివే

మార్చి 31న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా వెస్టిండిస్‌తో తలపడనుంది. ఐసీసీ వరల్డ్ టీ20లో టీమిండియా సెమీ పైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 2007 ప్రారంభ టోర్నీలో సెమీస్‌కు చేరుకున్న టీమిండియా, ఆ తర్వాత 2014లో జరిగిన టోర్నీలో కూడా విజయం సాధించింది.

WC T20: India have won both semifinals played in 2007 and 2014

2007: ఆసీస్‌పై 15 పరుగుల తేడాతో భారత్ విజయం

2007లో దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ 30 బంతుల్లో 70 పరుగులే టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 173 పరుగులకే ఆలౌట్ అయింది.

ఆసీస్ తరుపున ఓపెనర్ మ్యాథ్యా హెడెన్ అత్యధికంగా 47 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఓపెనర్లు ఆడమ్ గిల్ క్రిస్ట్, హెడెన్ వికెట్లను శ్రీశాంత్ పడగొట్టి మ్యాచ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఫైనల్ మ్యాచ్‍‌లో పాకిస్దాన్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా టైటిల్‌ను చేజిక్కించుకుంది.

WC T20: India have won both semifinals played in 2007 and 2014

2014: దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో భారత్ విజయం

బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. మిర్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అత్యధిక స్కోరుని ఛేజ్ చేసి మరీ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 67 బంతుల్లో 72 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఐదు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 2007, 2014లో భారత్ ఆడిన రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు కూడా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌ కావడం విశేషం.

18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా (ఫోటోలు)

ఈసారి కూడా టీమిండియా, వెస్టిండిస్‌తో ముంబైలోని వాంఖడె స్టేడియంలో రెండో సెమీ పైనల్ మ్యాచ్‌లో తలపడనుంది.

English summary
India will play the West Indies in the second semifinal of the T20 World Cup at the Wankhede Stadium here on Wednesday (March 31).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X