వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ రోడ్లపై అర్ధరాత్రి ధోని, కోహ్లీల కారు రేసింగ్..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: గత కొన్నేళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో ఓ అర్ధరాత్రి విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని రేసింగ్‌లో పాల్గొన్నారంట. ఈ ఫార్ములా వన్ రేసింగ్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గెలిచాడంట. ఈ విషయాన్ని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ ఇంటర్యూలో స్వయంగా వెల్లడించాడు.

ఇంటర్యూలో విరాట్ కోహ్లీ మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వేగంతో కార్లను నడపడం ఇష్టమన్న కోహ్లీ, ఈ సంఘటన భారత పర్యటన కోసం ఆస్టేలియా వచ్చినప్పుడు ఢిల్లీలో జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ, నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం. కార్లను మరింత స్పీడ్‌గా నడపటమంటే ఇంకా ఇష్టమని కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఢిల్లీలో ఆస్టేలియాలో మ్యాచ్ ఆడాల్సి ఉంది.

'మైఖెల్ జాక్సన్‌‌కు నివాళిగా రూపొందించి 'దిస్ ఈజ్ ఇట్' డాక్యుమెంటరీ ప్రివ్యూ షో చూడటానికి మేముంతా బయలుదేరాం. ధోని, సురేష్ రైనా ఇద్దరూ ఒక కారులో ఉన్నారు. అర్ధరాత్రి కావడంతో ఆ ప్రివ్యూ షో చూసేందుకు ఎవరు ముందుగా వెళతారోనని రేసింగ్ మొదలు పెట్టాం.' అని పేర్కొన్నాడు.

ఈ రేసింగ్‌లో ముందుగా నేనే అక్కడకి చేరుకున్నానని వివరించిన కోహ్లీ. ఆ అనుభూతి ఎంతో థ్రిల్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. సాధారణంగా పగలు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, కారు స్పీడ్‌గా నడపడం లాంటి క్రేజీ పనులను రాత్రి వేళ్లలోనే చేస్తానని తెలిపారు.

When Kohli and Dhoni were involved in a car race in Delhi

రేసింగ్ సమయంలో సీట్ బెల్టు పెట్టుకున్నారని అని అడిగిన ప్రశ్నకు గాను కోహ్లీ అవును సీట్ బెల్టు పెట్టుకున్నాను. కారు డ్రైవర్లు తప్పకుండా సీట్ బెల్టు ధరించాలని సూచించారు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ జట్టు మొత్తాన్ని లంబోర్ఘిని గల్లర్డో రైడ్‌కు తీసుకెళ్లారు.

గురువారం విరాట్ కోహ్లీ చేతుల మీదగా జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన సరికొత్త ‘ఆర్‌ఎస్‌6 అవంట్‌' సూపర్‌ స్పోర్ట్స్‌ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో దీని (ఎక్స్‌ షోరూమ్‌) ధర రూ.1.35 కోట్లు. ఈ సందర్భంగా కంపెనీ ఈ కారు 3.9 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుందని తెలిపింది.

‘పెర్‌ఫార్మెన్స్‌ కార్ల విభాగంలో మా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ కారును భారత మార్కెట్‌లో విడుదల చేశాం' అని ఆడి ఇండియా చీఫ్‌ జో కింగ్‌ చెప్పారు.

English summary
A few years ago, late at night on Delhi streets, Virat Kohli and MS Dhoni decided to race in their cars and the current Test captain won driving at Formula 1 speed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X