వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత కోసం ఆనాడు గుడి తలుపులు తెరిచి ఉంచారు

దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2001లో కన్నూరులోని తాలిపరమాంబలో గల రాజరాజేశ్వర ఆలయానికి వెళ్లిన సంఘటన వివాదాస్పదమయింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2001లో కన్నూరులోని తాలిపరమాంబలో గల రాజరాజేశ్వర ఆలయానికి వెళ్లిన సంఘటన వివాదాస్పదమయింది. ప్రముఖ ఆస్ట్రాలజర్ పరప్పనగండి ఉన్నికృష్ణన్ పనిక్కర్ సూచన మేరకు జయ ఆ రోజు తన నెచ్చెలి శశికళతో కలిసి ఆలయానికి వెళ్లారు.

శశికళ వల్లే, పన్నీరు చేయలేరు, జయకు భయంకర అనుభవం.. నా కోసం అప్‌సెట్: స్వామి

ఈ ఆలయంలో అథజ పూజ (పవళింపు సేవ) చేస్తారు. ఈ ఆలయం ఆచారం ప్రకారం ఈ పూజ అయ్యే వరకు మహిళలను లోనికి రానివ్వరు. ఆ తర్వాత గుడి మూస్తారు. కానీ జయలలిత తన సన్నిహితురాలు శశికళతో కలిసి ఆ రోజు సాయంత్రానికి అక్కడకు చేరుకున్నారు. ఆలయ ఆచారాన్ని పక్కన పెట్టి జయలలిత కోసం అధికారులు గుడిని రాత్రి గం.9.30 వరకు తెరిచి ఉంచారు.

ఇక్కడ మరో వివాదం కూడా ఉంది. అక్కడ, ఆలయంలోకి వెళ్లేందుకు ఒక వుడెన్ స్టెప్ ఉంది. దానిని క్రాస్ చేసేందుకు జయలలిత ఇబ్బంది పడ్డారు. దీంతో దానిని కట్ చేశారు.

When a temple kept its doors open for Jayalalithaa

అనంతరం ఆమె తిరుగు పయనం అయ్యారు. మధ్యలో జాతీయ రహదారిలోని పప్పినిస్సెరీ వద్ద జయలలిత కాన్వాయ్ ఆగింది. జయలలిత డిన్నర్ చేయడం కోసం దాదాపు గంట పాటు అక్కడ కాన్వాయ్ నిలిపివేశారు. ఆమె కాన్వాయ్ జాతీయ రహదారి పైన ఆగడంతో అది వివాదాస్పదమయింది. ట్రాఫిక్ జాం కావడంతో పాక్షికంగా దారి ఇచ్చారు.

ఇదిలా ఉండగా, జయలలిత రాకతో గుడి మరింత పాపులర్ అవుతుందని భావించారు. ఆమె గుడికి వచ్చిన తర్వాత గుడి పాపులర్ అయిందని, భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారని, వస్తున్న భక్తులలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా ఉన్నారని టెంపుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ చెప్పారు.

English summary
In 2001, Jayalalithaa visited the famous Rajarajeshwara Temple at Taliparamba in Kannur on the advice of famous astrologer Parappanangadi Unnikrishna Panikkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X