వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు కూతుళ్లు.. నాలుగు నదులు: సినారె ఆ పేర్లు పెట్టడం వెనుక ఆంతర్యం!..

తెలుగులో ఏ కవికి లేనంత శిష్య గణం కూడా ఆయనకు ఉందని చెబుతారు. రచనా ప్రక్రియలన్నింటిపై పట్టున్న సినారె ఎక్కువగా కావ్య రచనకే ప్రాధాన్యం ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినీ కవిత్వంతో తెలుగు శ్రోతలను ఓలలాడించిన సాహితీ శిఖరం సినారె నేలకొరగడం ఎంతోమంది సాహిత్యభిమానులను దు:ఖ వివశుల్ని చేసింది. కవిగా మాత్రమే కాక ఉస్మానియా అధ్యాపకుడిగా.. ఉర్దూలో అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించినవాడిగా సినారెకి ప్రత్యేక గుర్తింపు ఉంది.

ప్రముఖ సాహితీవేత్త సి నారాయణ రెడ్డి కన్నుమూత, సినారె ప్రస్థానంప్రముఖ సాహితీవేత్త సి నారాయణ రెడ్డి కన్నుమూత, సినారె ప్రస్థానం

తెలుగులో ఏ కవికి లేనంత శిష్య గణం కూడా ఆయనకు ఉందని చెబుతారు. రచనా ప్రక్రియలన్నింటిపై పట్టున్న సినారె ఎక్కువగా కావ్య రచనకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ లాంటి వ్యక్తితో సినారెతో అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన జీవితంలో స్టేషన్ దాకా వచ్చి రిసీవ్ చేసుకున్నది ఒక్క సినారే గారిని మాత్రమే అని చెబుతారు.

why narayanareddy named his daughters on the name of rivers

సినారె తెలుగు నేలను వీడిపోయిన నేపథ్యంలో.. ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

మనసుకు తొడుగు మనిషి
మనిషికి ఉడుపు జగతి
ఇదే విశ్వంభరా తత్వం
అనంత జీవిత సత్యం..
అంటూ విశ్వంభరలో జీవిత సత్యాన్ని బోధించిన సినారె.. నిజ జీవితంలో ప్రకృతిని ఎక్కువగా ఆరాధించినట్లు చెబుతారు.

ఈ నేపథ్యంలోనే సినారె తన కుమార్తెలకు సైతం నదుల పేర్లు పెట్టుకున్నారు. అయితే ఇలా నదుల పేర్లు పెట్టడం గురించి ఓ ఇంటర్వ్యూలో సినారె ఆసక్తికర విషయాలు చెప్పారు.

సినారె దంపతులకు పుట్టిన తొలి ముగ్గురు సంతానం ఎక్కువ రోజులు బతకలేదు. దీంతో తర్వాత పుట్టబోయే కుమార్తె ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కుటుంబ సభ్యులు గంగకు మొక్కుకున్నారట. ఉత్తర తెలంగాణలో ఇప్పటికీ గోదావరి నదిని గంగా అనే పిలుస్తారు. అలా గంగకు మొక్కులు చెల్లించుకున్న తర్వాత పుట్టిన కుమార్తెకు అదే పేరు పెట్టారు సినారె. ఆ తర్వాత పుట్టిన కూతుళ్లకు కూడా.. యమునా, సరస్వతి, కృష్ణవేణి అని నదుల పేర్లు పెట్టారు.

English summary
Noted poet and writer Cingireddi Narayana Reddy, recipient of the Jnanpith Award in 1988, passed away on Monday,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X