పూరిని రౌండప్ చేసిన మీడియా: ఊపిరాడట్లేదు.. ఫ్రస్టేషన్ లోనే ఆ నింద?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సినిమాల్లో హీరోయిజాన్ని పోలీస్ క్యారెక్టర్లతో ఓ రేంజ్‌లో చూపించే పూరికి.. నిజం జీవితంలో మాత్రం పోలీసులే విలన్లుగా మారారు. స్క్రీన్ మీద ఆయన పేల్చే డైలాగులు విలన్లను ఎంతలా దడదడలాడిస్తాయో.. ఇప్పుడు పోలీసుల ప్రశ్నలూ పూరిని అంతేలా వణికిస్తున్నాయి.

బేసిగ్గానే పూరి హీరో ఎక్కడా తగ్గే రకం కాదు. దేన్నయినా మొండిగా ఢీకొనే రకం. కొన్నిసార్లు డ్రగ్ తీసుకున్న వ్యక్తిలా పిచ్చి పిచ్చిగాను ప్రవర్తిస్తుంటాడు ఆయన హీరో. ఇలాంటి పాత్రల వెనుక పూరి బుర్రలో 'డ్రగ్' ఏమైనా పనిచేసిందా? అన్న జోకులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పేలుతున్నాయి.

పూరి హర్ట్ అయ్యాడు:

పూరి హర్ట్ అయ్యాడు:

సహజంగానే టీఆర్పీల వెనుక పరిగెత్తే మీడియా.. గరం గరం 'పూరి' లాంటి వార్త దొరికితే మాత్రం అంత ఈజీగా వదులుతుందా?.. రోజు వారీ న్యూస్ షెడ్యూల్ మొత్తాన్ని పూరి చుట్టే తిప్పేసి.. మంచి మసాలా దట్టించి, నంజుకు తినేసినంత పనిచేసింది.

పాపం.. పూరి ఇగో హర్ట్ అయింది. సహజంగా సినిమాల్లో అయితే.. ఇలాంటి సందర్భంలో పూరి క్యారెక్టర్ మాస్ డైలాగులతో విరుచుకుపడుతుంది. కానీ సీన్ స్క్రీన్ నుంచి రియాలిటీకి మారిపోయి.. పాత్రలో 'పూరి'నే దూరాల్సి వచ్చేసరికి.. ఆయన నోటివెంట మాట రావడం లేదు. ట్విట్టర్‌‌లో ఒక వీడియో పోస్టు చేసి బావురుమన్నంత పనిచేశాడు.

Tollywood Drugs Scandal : Top Hero And Heroine To Be Arrest - Oneindia Telugu
నింద సబబేనా?

నింద సబబేనా?

మీడియా అంటే తనకు ఇష్టమంటూనే తన జీవితాన్ని సర్వనాశనం చేసేసిందని నింద వేశాడు. సర్వనాశనం కాకపోయినా కొంత డ్యామేజీ జరిగిందనేది మాత్రం నిజం. అయితే ఇదంతా మీడియా చలవే అనడం కూడా పూరికి సబబు కాదేమో?.. వాస్తవానికి దూరంగా మీడియా ఆయనపై నిందలేమి వేయలేదు. ఆయన సినిమాలు హిట్లు కొట్టినప్పుడు ఎంతలా డబ్బా కొట్టిందో.. ఇప్పుడూ అంతే స్పందిస్తోంది. తేడా అంతా రీల్‌కు-రియాలిటీకి మధ్యే.

రౌండప్ చేసేసరికి:

రౌండప్ చేసేసరికి:

కాకపోతే, మీడియా అంతా ఒక్కసారిగా రౌండప్ చేసేసరికి పూరి కొంత కంగు తిన్నాడు. 'రౌండప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు.. కన్ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తా!' అని డైలాగ్ రాసినంత ఈజీగా మీడియాను ఫేస్ చేయలేమని అర్థం చేసుకున్నాడు.

సినిమా హిట్టయినప్పుడు.. 'డైనమిక్ డైరెక్టర్' అంటూ పొగిడిన మీడియానే.. కనబడని 'షేడ్స్'పై ఫోకస్ పెడుతున్నందుకు సర్వనాశనం చేస్తున్నారంటూ పూరి ఫ్రస్టేట్ అవుతున్నాడు. నిజానికి మీడియాకు అత్యుత్సాహం ఎక్కువ కాబట్టి అన్నిసార్లు బ్యాలెన్సింగ్‌ సాధ్యపడదు. సెన్సేషన్ కోసం పడే వెంపర్లాటలో ఇప్పుడు దానికి పూరి దొరికాడు.

నిజమేంటి?:

నిజమేంటి?:

సినిమాలతో బ్యాలెన్స్ అయిన పూరి జీవితాన్ని డ్రగ్స్ బ్యాలెన్స్ తప్పించాయా? అని మీడియా వేస్తున్న ప్రశ్న ఆయన్ను ఆవేదనకు గురిచేస్తున్నాయి. మరి పూరి ఆవేదనలో నిజమెంత?.. మీడియా అనుమానాల్లో నిజమెంత? అన్నది విచారణలో తేలితే గానీ చెప్పలేం. ఏమో!.. విచారణలోను కొన్నిసార్లు నిజాలు బయటపడకపోవచ్చేమో!.. జీవితం దారి తప్పకుండా చూసుకుంటే తప్ప మీడియా హితబోధకు వీలైనంత దూరంగా ఉండవచ్చు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tollywood Dynamic director Puri Jagannath posted a video in twitter on the frustation of media
Please Wait while comments are loading...