హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెండా ఊపి సైకిల్ తొక్కిన నాగార్జున (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శాంతి సందేశాన్ని ప్రచారం చేస్తూ ప్రముఖ యోగా గురు భరత్ ఠాకూర్ బృందం ప్రారంభించిన సైక్లథాన్ విజయవంతం కావాలని సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆకాంక్షించారు. శాంతి, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రపంచానికి చాటుతూ సైకిల్ యాత్ర చేస్తున్న యోగా గురు భరత్ ఠాకూర్ బృందం మంగళవారం నగరానికి చేరుకుంది.

ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో సినీనటుడు నాగార్జున వారి దక్షిణాది సైకిల్ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. 3000 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించిన వారి సంకల్పాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రముఖ యోగా గురు భరత్ ఠాకూర్ మాట్లాడుతూ యోగాపై అవగాహన ఉన్నప్పటికీ, గ్రామాల్లోని ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.

సైకిల్‌పై కింగ్ నాగార్జున

సైకిల్‌పై కింగ్ నాగార్జున

అందుకే యోగచక్ర పేరుతో తాము ప్రారంభించిన ఈ సైకిల్ యాత్రలో యోగాపై అవగాహనతో పాటు, పర్యావరణ పరిరక్షణపై కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు.
సైకిల్‌పై కింగ్ నాగార్జున

సైకిల్‌పై కింగ్ నాగార్జున


వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు సైతం తమ యాత్రకు ఆహ్వానం పలికారని అన్నారు.

సైకిల్‌పై కింగ్ నాగార్జున ఈ

సైకిల్‌పై కింగ్ నాగార్జున ఈ


కార్యక్రమంలో రాజశేఖర్ కూడా పాల్గొన్నారు. యోగ చక్ర పేరుతో భరత్ ఠాకూర్, రాజశేఖర్, రవి శేషాద్రి బృందం ఆరంభించిన సైక్లిథాన్‌ను ఫిబ్రవరి 14న నేపాల్ భారత రాయబారి రంజిత్ రే ఖాట్మండులో ప్రారంబించారు.

 సైకిల్‌పై కింగ్ నాగార్జున

సైకిల్‌పై కింగ్ నాగార్జున


90 రోజుల్లో 11 రాష్ట్రాల మీదుగా 5వేల కిలోమీటర్లు ప్రయాణించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ సైక్లిథాన్‌కు ఆయా రాష్ట్రాల్లోని సామాజిక కార్యకర్తలు, ఫిట్‌నెస్ పీపుల్ నుంచి మంచి స్పందన లభిస్తుండటం గమనార్హం.

 సైకిల్‌పై కింగ్ నాగార్జున

సైకిల్‌పై కింగ్ నాగార్జున


ఖాట్మండు నుంచి గోరఖ్ పూర్, లక్నో, ఆగ్రా, ఢిల్లీ, జైపూర్, కోట, భూపాల్, నాగ్‌పూర్ నగరాల మీదుగా ప్రయాణించి 57 రోజులు తర్వాత మంగళవారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.

సైకిల్‌పై కింగ్ నాగార్జున

సైకిల్‌పై కింగ్ నాగార్జున


ఈ బృందం నగరం నుంచి బెంగుళూరు, మైసూర్, కొచ్చిన్ అలెప్పీల మీదుగా కన్యాకుమారి చేరుకోనుంది. యోగా ప్రాముఖ్యతను, శాంతి, సామరస్యాన్ని ప్రచారం చేసేందుకే సైక్లింగ్‌ని చేపట్టినట్టు బృంద సభ్యులు తెలిపారు.

English summary
Renowned Yoga Guru Bharat Thakur undertakes ‘Yoga Chakra’- Taking yoga back to its roots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X