వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచి ఛాన్స్ మిస్: రోజా తర్వాత.. జగన్ ప్లాన్ రివర్స్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ రివర్స్ అయిందా? అంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ఫేజ్ 2లో భాగంగా విశాఖ నుంచి పలువురు వైసిపి ఎమ్మెల్యేలు కారు ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

మరోవైపు, విశాఖ రైల్వే జోన్ కోసం అంటూ వైసిపి నేత గుడివాడ అమర్నాథ్ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన నిరాహార దీక్షను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోవాలని భావించింది. ముఖ్యంగా జగన్ ఆయన దీక్షా స్థలిని పర్యటిస్తే వైసిపికి మైలేజ్ బాగా వచ్చేదని అంటున్నారు.

జగన్, వైసిపి నేతలు కూడా అదే ఆలోచనతో ఉన్నారని, నేడో రేపో గుడివాడ అమర్నాథ్ దీక్ష స్థలిని సందర్శించి ఆయనకు మద్దతు పలకాలని భావించారని తెలుస్తోంది. అయితే అంతలోనే పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. అమర్నాథ్ దీక్షకు ఎమ్మెల్యే రోజా స్వయంగా వచ్చి మద్దతు పలికారు.

YS Jagan plane reverse on Amarnath deeksha!

ఆమె రాక ప్రభావం కొంత కనిపించింది. వైసిపి కేడర్లో ఉత్సాహం కనిపించింది. జగన్ కూడా వస్తే మరింత ప్లస్ అవుతుందని భావించారు. అయితే, అంతలోనే అమర్నాథ్ దీక్షను పోలీసులు భగ్నం చేయడం గమనార్హం. రోజా తర్వాత జగన్ కూడా వస్తే తమకు మైలేజ్ పెరుగుతుందనే వైసిపి ప్లాన్ రివర్స్ అయిందని అంటున్నారు.

ఆదివారం రాత్రి పోలీసులు గుడివాడ అమర్నాథ్ దీక్షను భగ్నం చేశారు. ఆయనను చికిత్స నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. విశాఖకు రైల్వే జోన్ కావాలంటూ ఆయన నిరాహార దీక్ష చేశారు. రోజా ఆయన దీక్షలో ప్రసంగించి, తెలుగుదేశం పార్టీ నేతల పైన తీవ్రంగా విమర్శలు చేశారు.

ఆ తర్వాత జగన్ కూడా వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ జగన్ రాకముందే ఆయనను ఆసుపత్రికి తరలించారు. జగన్ వస్తే మైలేజ్ వస్తుందని భావించామని, కానీ ఆ అవకాశం మిస్ అయిందని వైసిపిలో చెవులు కొరుక్కుంటున్నారట.

English summary
YSRCP chief YS Jagan plane reverse on Gudiwada Amarnath deeksha!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X