వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆఫ్రికా విద్యార్ధుల భారతీయ నృత్యం
విశ్వధర్మ ప్రచారయాత్ర పేరుతో ప్రారంభించిన ఈ యాత్రలో తొలి ఘట్టంలో భాగంగా భారత్‌లోని పలు నగరాలను చుట్టుముట్టి, అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఈ బృందం ఇదివరకే పర్యటించింది. యూరప్‌లోని తొమ్మిది దేశాలను ఇప్పుడు బృందం సందర్శిస్తుంది. విశ్వహిందూ పరిషత్ విదేశీ విభాగం దేశంలోనూ విదేశాల్లోనూ వున్న మరికొన్ని హిందూ మత, ధార్మిక సంస్ధలు ఈ పర్యటనను ఏర్పాటు చేశాయి. శుక్రవారం నాడు ఈ బృందం బర్మింగ్హమ్ చేరుకుంటుందని అక్కడినుంచి శనివారం నాడు లండన్ వెళ్లుతుందని నిర్వాహకులు చెప్పారు. సెప్టెంబర్ తొమ్మిదిన పారిస్‌ను సందర్శిస్తారు. అక్కడనుంచి బయలుదేరి జర్మనీ, నెధర్లాండ్స్, డెన్మార్క్, నార్వే, పోర్చుగల్, రష్యా కూడా ఈ బృందం సందర్శిస్తుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!