మలేషియాలో బాలీవుడ్ మెరుపులు
కౌలాలంపూర్ఃమలేషియాలో బాలీవుడ్ సినిమాల ప్రభావం రాను రాను పెరుగుతోంది. కొత్తగా నిర్మితమవుతున్న బాలీవుడ్ సినిమాల ఆడియోకేసెట్లు, సి.డిలు ఇక్కడి కేసెట్ దుకాణాల్లో విరివిగాకనిపిస్తుండటమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అంతేకాకుండా మలేషియా దేశపు పత్రికలను తిరగేస్తే షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, రితిక్రోషన్ లాంటి అనేక మంది బాలీవుడ్ హీరోలు,హీరోయిన్లు కనిపిస్తారు. మాధురీ దీక్షిత్ పెళ్ళిచేసుకుంది కదా...మరి ఇక ముందుసినిమలలో నటిస్తుందా? అనే చర్చలు, గాసిప్‌లతో ఇక్కడి పత్రికలు వర్ధిల్లుతున్నాయి. మలేషియాలో ఉన్న చాలా మంది ప్రజలకి హిందీ అర్ధం కానప్పటికీ మన సినిమాల్లోని పాత్రలు,సందర్భాలతో ఐడెంటిఫై అవుతుంటామని చెపుతున్నారు. సినిమాతో పాటు వాళ్ళ భాషలో ఉండేసబ్టైటిల్స్ ఇంతలా వారు స్పందించడానికి కారణంకావచ్చు. భారతీయ సంతతిలో ఇక్కడ ఎక్కువగాఉన్నది దక్షిణాది వారే అయినా సిక్కులు, ఇతరుల సంఖ్య కూడా చెప్పుకోదగ్గదే.