వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రహస్య చర్చల లోగుట్టు

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: తెలంగాణపై రాజీనామాస్త్రాలు ప్రయోగించాలనే నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు మరో రాజకీయ ప్రయోగానికి సిద్ధపడ్డారు. తెలంగాణపై పార్టీ అధిష్ఠానవర్గంపై ఒత్తిడి తెస్తున్న తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ నాయకులను రహస్యంగా కలిసే ప్రయత్నానికి తెరాస నాయకులు పూనుకున్నారు. శాసనసభ్యులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ మరికొంత మందితో కలిసి కాంగ్రెస్ నాయకులతో రహస్య మంతనాలు జరపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తెలంగాణ ప్రాంతీయ బోర్డు చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిని కలిశారు. అయితే ఈ భేటీకి సాకు చెప్పేందుకు వారికి వీలు పడింది. రాబోయే బడ్జెట్టులో తెలంగాణకు కేటాయించే నిధులపై ఆరా తీయడానికే తెరాస శాసనసభ్యులు తన వద్దకు వచ్చారని ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి చెప్పుకుంటున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన శాసనసభలో ఆర్థిక మంత్రి కె. రోశయ్య బడ్జెట్టును ప్రతిపాదించనున్నారు. దీని కోసమే తెరాస సభ్యులు పురుషోత్తమ రెడ్డి వద్దకు వచ్చినట్లు బుకాయిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైన విజ్ఞప్తిని చేయడానికి వారు వచ్చినట్లు తెలుస్తున్నది.

అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామిని కలిసేందుకు వచ్చారు. ఎవరి కంటపడకుండా, ముఖ్యంగా మీడియా కంట పడకుండా వెంకటస్వామిని కలిసి తగిన మంతనాలు జరిపి వెళ్లిపోవాలని అనుకున్నారు. అయితే మీడియా కంట పడడంతో మెల్లగా అక్కడ్నుంచి జారుకున్నారు. దీంతో వెంకటస్వామిని కలిసే అవకాశం వారికి దక్కలేదు. రెండో ఎస్సార్సీ వేస్తే తాను రాజీనామా చేస్తానని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని వెంకటస్వామి ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ నాయకుల్లో కాక పుట్టింది. వెంకటస్వామి తొవ్వలో నడవడానికి మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు కూడా సిద్ధపడ్డారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఎస్సార్సీపై వెనక్కి తగ్గింది.

తెరాస శాసనసభ్యులు, ఎమ్సెల్సీలు, పార్లమెంటు సభ్యులు మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి ఇంకా 40 రోజుల గడువు ఉంది. ఈలోగా కాంగ్రెసు నాయకులు తమ తెలంగాణ వాణి తీవ్రతను తగ్గించుకోకుండా చూడాలనేది తెరాస ఎత్తుగడగా కనిపిస్తున్నది. అందుకే వారు తెలంగాణ కాంగ్రెసు నేతలతో రహస్య మంతనాలు జరపడానికి తయారైనట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X