హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెర వెనక అల్లు అరవింద్

By Staff
|
Google Oneindia TeluguNews

Allu Aravind
ప్రజారాజ్యం నేత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్‌ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి బాధ్యుడిని చేస్తూ సీనియర్లు విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పరాజయం పాలైన అభ్యర్థులతో చిరంజీవి నిర్వహిస్తున్న సమీక్షలకు, పార్టీ పునర్‌ వ్యవస్థీకరణపై సీనియర్‌ నేతల జరుపుతున్న చర్చలకు ఆయన హాజరుకావటం లేదు. వారం రోజులపాటు కొందరు పార్టీ సన్నిహితులతో కలిసి అరవింద్‌ హాంకాంగ్‌ పర్యటనకు వెళ్లి వచ్చారు. వారం రోజుల క్రితం తిరిగి వచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన పార్టీ కార్యాలయానికి రావడం లేదు.

చిరంజీవి పార్టీకి సంబంధించిన ప్రతి కీలక నిర్ణయంలో ఆయన పాత్ర ఉంటూ వచ్చింది. తెర వెనక నుంచి మొదట పార్టీని నడిపించినా ఆ తర్వాత బహిరంగంగా ముందుకు వచ్చారు. పార్టీ పదవులకు ఎంపికలు, వామపక్షాలు, మనపార్టీతో పొత్తుల చర్చలు, విలీనాలు, ఎన్నికల సంఘంతో సంప్రదింపులు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలు అల్లు ప్రమేయంతోనే జరిగాయి. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని కొందరు నాయకులు గట్టిగా సూచించారు. అరవింద్‌ పై వచ్చిన ఆరోపణలు, విమర్శల్ని అంతర్గత వేదికలపైనా, బహిరంగంగానూ చిరంజీవి గట్టిగా ఖండించారు. ఆయనను సమర్థించారు. రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని వాదించారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే అరవింద్‌ చుట్టూనే అన్ని వ్యవహారాలూ నడుస్తాయని అంతా భావించారు.

పార్టీని పునర్‌వ్యవస్థీకరణకు అధ్యక్షుడు నియమించిన కమిటీలో కేంద్ర మాజీమంత్రి ఉపేంద్ర, పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు కె.వి.రావు, ఉమామల్లేశ్వరరావు, కార్యాలయ కార్యదర్శి రాధాకృష్ణలు సభ్యులుగా ఉన్నారు. వీరు తరచూ సమావేశమై చర్చిస్తున్నారు. ఇందులోనూ అరవింద్‌ పాల్గొనటం లేదు. వ్యూహాత్మకంగానే ఆయన ఇలా చేస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఫలితాల అనంతరం వచ్చిన విమర్శల దృష్ట్యా కొంతకాలంపాటు తెరవెనక ఉండాలని అయన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. బహిరంగంగా కనిపించక పోయినా కీలకాంశాల్లో ఆయన ప్రమేయం తప్పక ఉంటుందనేది కాదన లేని సత్యం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X