హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు పొత్తుల ఎత్తులు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వచ్చే గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లోనైనా సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. శాసనసభ, లోకసభ ఎన్నికల్లో చతికిల బడ్డ పార్టీకి గ్రేటర్ ఎన్నికలతో రక్తం ఎక్కించాలని ఆయన అనుకుంటున్నారు. రెండు నెలలకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ స్థితిలో ఇప్పటి నుంచే చిరంజీవి తన ప్రయత్నాలు ప్రారంభించారు. బలం చాటుకోవడానికి పొత్తులే శరణ్యమనే అభిప్రాయానికి కూడా ఆయన వచ్చినట్లు చెబుతున్నారు.

జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోకసత్తా పొత్తుల కోసం చిరంజీవి చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. లోకసత్తా రాష్ట్రంలో గుర్తించదగిన వోటు బ్యాంకును సాధించిందనే విషయం లోకసభ, శాసనసభ ఎన్నికల ద్వారా రుజువైంది. పట్టణ మధ్యతరగతి,యువతలో లోకసత్తా మెల్లగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది. దీంతో హైదరాబాదులో లోకసత్తాతో పొత్తు వల్ల తమకు కలిసి వస్తుందని ప్రజారాజ్యం పార్టీ నాయకులు భావిస్తున్నారు.

అదే సమయంలో జాతీయ నాయకత్వం పట్టు వల్ల తెలుగుదేశం వైపు వెళ్లిన సిపిఐ రాష్ట్ర నాయకత్వం కచ్చితంగా తమతోనే ఉంటుందని ప్రజారాజ్యం పార్టీ నమ్ముతోంది. సిపిఎం తెలుగుదేశంతోనే వెళ్లడానికి సిద్ధపడిన పరిస్థితిలో సిపిఐ నాయకత్వం కమ్యూనిస్టుల సయోధ్య కన్నా ప్రజారాజ్యం పార్టీతో కలిసి రావడానికే ఇష్ట పడే అవకాశం ఉంది.

ఇక ఇప్పటి వరకు బిజెపితో కలిసేది లేదంటూ చెబుతూ వచ్చిన చిరంజీవి మనసు మారినట్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో బిజెపితో కలిసి పనిచేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులో బిజెపి చెప్పుకోదగిన స్థాయిలో ఉండడమే అందుకు కారణమని చెబుతున్నారు. మొత్తం మీద చిరంజీవి పొత్తుల ఎత్తులకు పదును పెడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X