హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూ.ఎన్టీఆర్ రాజకీయం

By Staff
|
Google Oneindia TeluguNews

Jr Ntr
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధపడుతున్నట్లే కనిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసి విశేషంగా ప్రజలను ఆకట్టుకున్న ఆయన తన రాజకీయ ప్రసంగ పాటవాన్ని రుజువు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆ తర్వాత ప్రచారానికి దూరమయ్యారు. మళ్లీ ఈ నెల 28వ తేదీ మహానాడు వేదిక మీద దర్శనమిచ్చారు. బాబాయ్ బాలయ్య తర్వాత ఆయన మహానాడులో ప్రసంగించారు. ఆయన రాజకీయ ప్రసంగంలో పరిణతి కనిపించింది. బాలయ్య కన్నా ఎన్టీఆర్ బెట్టర్ అని అనిపించారు కూడా.

ఆ ప్రసంగంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెప్పారు. పార్టీకి ప్రాణాలైనా అర్పిస్తానని, పార్టీలో ఏ బాధ్యతలు అప్పగించినా నెరవేరుస్తానని ఆయన చెప్పారు. తద్వారా తాను రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యాన్ని బయట పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాన్ని కుతూహలంగా వినడం కనిపించింది. దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగు యువత సారథ్యాన్ని ఆశిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఆ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించడానికి ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు కూడా పెద్ద అభ్యంతరం లేకపోవచ్చు. బాలయ్యకు చెక్ పెట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన వెంట ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.

పార్టీలో నందమూరి హీరోల ప్రాధాన్యత పెరగాలని మహానాడుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులు కోరుకుంటున్నారు. పార్టీకి పూర్వవైభవం తేవాలంటే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించాల్సిందేనని వారు అభిప్రాయపడుతున్నారు. మహబూబ్‌ నగర్‌ కు చెందిన బాలరాజు మాట్లాడుతూ విమర్శ లేకుండా ఉండాలంటే నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురండి. బాలకృష్ణను పొలిట్‌బ్యూరోలోకి, జూనియర్‌ ఎన్టీఆర్‌ను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా చేయండి అని సూచించారు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్న అభిప్రాయమేమిటో తెలిసిపోతూనే ఉంది.

రాబోయే కాలంలో జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ లక్ష్యానికి అనుగుణంగా పని చేయడం ప్రారంభిస్తారని అనుకోవచ్చు. సినిమాలను, రాజకీయాలను ఆయన జోడు గుర్రాలను చేసుకోవాలని అనుకుంటున్నట్లు భావించవచ్చు. నందమూరి హీరోల ప్రాధాన్యం చంద్రబాబుకు ఏ మేరకు రుచిస్తుందో చెప్పలేం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X