హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు తారక రక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబం నుంచి ఇప్పట్లో ప్రమాదమేమీ లేదు. తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అప్పగించాలని అసమ్మతి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పదే పదే డిమాండ్ చేస్తూ చంద్రబాబును ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబానికి చెందిన సినీ హీరో తారకరత్న స్పష్టమైన ప్రకటన చేశారు. తెలుగుదేశం నాయకత్వం విషయంలో తమ కుటుంబంలో ఈ విధమైన విభేదాలు లేవని, అసలు కుటుంబలో విభేదాలే లేవని ఆయన గురువారం అన్నారు. చంద్రబాబు నాయకత్వం ప్రస్తుతానికి కొనసాగుతుందని ఆయన చెప్పారు. అయితే భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేమని మాత్రం కాస్తా తిరకాసు పెట్టారు.

బాబాయ్ బాలకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని పదే పదే ప్రకటనలు చేస్తూ గతంలో చంద్రబాబుకు తీవ్రమైన ఇబ్బంది కలిగించారు. అయితే, తర్వాత దారికి వచ్చి బాబాయ్ బాలయ్య బాటలో నడిచి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ప్రచార రంగంలోకి దిగారు. అయితే బాబాయ్ ప్రయత్నం గానీ, అబ్బాయిల ప్రయత్నం గానీ ఫలించలేదు. చంద్రబాబుకు అధికారం ఆమడదూరంలోనే ఉండిపోయింది.

వచ్చే ఎన్నికల నాటికి ఏమవుతుందో చెప్పలేని స్థితే ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన దృష్ట్యా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచే చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం. వచ్చే ఐదేళ్ల పాటు మఖ్యమంత్రి డాక్ట్ర వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ ఎత్తుగడలను ఎదుర్కోవడం, ఎన్టీఆర్ కుటుంబ మద్దతు చెదిరిపోకుండా చూసుకోవడం చంద్రబాబుకు అంత సులభమైన విషయమేమీ కాకపోవచ్చు. అయితే బాలకృష్ణను కూడా ఇబ్బంది పెట్టే రీతిలో తన కుమారుడు లోకేష్ ను చంద్రబాబు ముందు పెట్టినా పెట్టవచ్చు. స్వయానా అల్లుడు కావడంతో, తన కూతురు భర్త కావడంతో బాలయ్య వెనక్కి తగ్గవచ్చునని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X