హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు షాక్

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
రాష్ట్రంలో వరుస పరాజయాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని షాక్ గురి చేస్తున్నాయి. శాసనసభ, లోకసభ ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో పార్టీలో అలుముకున్న నిరాశానిస్పృహలు తొలిగిన జాడలు కనిపించడం లేదు. దీంతో టెక్కలి శాసనసభ ఉప ఎన్నికలోనే కాకుండా అనంతపురం ఎమ్సెల్సీ ఉప ఎన్నికలోనూ తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. ఇటీవలి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ చతికిలపడింది. ఈ పరాజయాల పరంపర ఇదే విధంగా కొనసాగితే తర్వాతి ఎన్నికల నాటికైనా కోలుకుంటామా, లేదా అనే ఆందోళన పార్టీ నాయకత్వాన్ని పట్టి పీడిస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయనే మాట బయటకు చెప్పుకునేదే తప్ప పార్టీ పరిస్థితి ఏ మాత్రం మెరుగ్గా లేదని ఫలితాలు తెలియజేస్తున్నాయని పార్టీ వర్గాలే అంటున్నాయి.

అనంతపురం జిల్లా ఎమ్మెల్సీగా ఉన్న పల్లె రఘునాథ రెడ్డి పుట్టపర్తి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అయితే ఎమ్మెల్సీకి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. తాము ఇక్కడ గట్టి పోటీ ఇవ్వలేకపోయామని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. జడ్పీటిసి, ఎంపిటీసిల ఉప ఎన్నికల్లో ఫలితాలు చాలా చోట్ల ఇదే విధంగా వచ్చాయి. కాంగ్రెసు 11 జడ్పీటిసీలను గెలుచుకోగా, తెలుగుదేశం పార్టీ 4 స్థానాలు మాత్రమే దక్కాయి. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ బలంగా ఉన్న చోట్ల కూడా పరాజయం పాలు కావడం తెలుగుదేశం నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. కోస్తాలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం కోలుకోలేదని ఫలితాలు రుజువు చేస్తున్నాయి.

చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టి ఉత్సాహపరచడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పార్టీ జిల్లా నాయకత్వాలే కాకుండా సీనియర్ నేతలు కూడా ఏ మాత్రం కృషి చేయలేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. శాసనసభ, లోకసభ ఎన్నికల తర్వాత ఏర్పడిన స్తబ్దత పార్టీలో ఇంకా తొలిగిపోయిన జాడలు లేవు. కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీలు బలహీనపడితే తాము లబ్ధి పొందాలని మాత్రమే నాయకులు భావిస్తున్నారు. కానీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి, క్యాడర్ ను ఉత్సాహపరిచే చర్యలేవీ తీసుకోవడం లేదు. తాను చెప్పినా నాయకులు కదలకపోవడం చంద్రబాబును కలవరపెడుతున్నట్లు సమాచారం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఐదేళ్లనాటికైనా పుంజుకుంటామా లేదా అనే అనుమానం ఆయనను పీడిస్తున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X