వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ 'జగన్మా'య

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, సాక్షి దినపత్రిక అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ మాయలో పడ్డారు. అభ్యర్థుల ఖరారుకు ముందే ఆయన కడప లోకసభ నియోజకవర్గంలో తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన నమ్మకానికి అర్థం లేకపోలేదు. తమ తండ్రిని, తమ కుటుంబాన్ని కాదని కడప లోకసభ స్థానం ఎవరికీ పోదనే విషయం ఆయన తెలుసు. అందుకే ఆయన తన ప్రచారాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం కోసం కూడా ఎదురు చూడకుండా ప్రచారాన్ని మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి ఆయన చిన్నాయన వైయస్ వివేకానంద రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజానికి, గతంలోనే వివేకానంద రెడ్డి జగన్ కోసం తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఆయన చేత రాజీనామా చేయించి కుమారుడి కోసం కడప లోకసభ స్థానానికి ఉప ఎన్నిక జరిపించాలని రాజశేఖర రెడ్డి ప్రయత్నించారు. అయితే ఆయన అత్యుత్సాహానికి అప్పట్లో కాంగ్రెస్ అధిష్ఠానం బ్రేక్ వేసింది. దీంతో జగన్ లోకసభకు పోటీ చేయడంలో కాస్తా ఆలస్యం జరిగింది. వైయస్ తలచిందే అధిష్ఠానం ఆమోదించింది. కడప లోకసభ స్థానాన్ని ఆయన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఖరారు చేసింది.

ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై వైరాగ్యం ప్రకటించారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. తన సాక్షి పత్రిక విశ్వసనీయత పోకూడదని, ఉద్యోగుల సంక్షేమం కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని చెప్పారు. జగన్ పై అక్రమాల ఆరోపణలు చేస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వరుసగా వార్తాకథనాలు ప్రచురిస్తున్న సమయంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఆయన తన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. పోటీకే మొగ్గు చూపారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై కూడా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మూడు రోజుల నుంచే ఆయనను గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్నారని, గత ఐదేళ్లుగా ఆ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X