వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ కు సులభమా

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
తెలంగాణలో పది శాసనసభా స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో గట్టెక్కడం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు అంత సులభమేమీ కాకపోవచ్చు. కెసిఆర్ ను దెబ్బ తీయడమే లక్ష్యంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. వేములవాడ, సిరిసిల్ల శాసనసభా నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు ప్రస్తుతం నిర్వహించడం లేదు. మిగతా పది స్థానాలకు ఇసి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని తెలిసినా తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెసు కూడా ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. పది స్థానాల్లో 9 స్థానాలు తెరాస శాసనసభ్యులు, ఒక స్థానం బిజెపి సభ్యుడు రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయ్యాయి. పాత అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గట్టెక్కుతారనే అభిప్రాయం అంతటా నెలకొని ఉంది.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ప్రచారం చేయకుండా అడ్డుకుంటామని తెలంగాణ రాజకీయ, విద్యార్థి జెఎసిలు ప్రకటించాయి. అయితే, అది సాధ్యమయ్యే పనేనా అనేది ప్రశ్న. ఈ హెచ్చరికల నేపథ్యంలో, తెలంగాణలోని పరిస్థితుల నేపథ్యంలో ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో కనీవినీ ఎరుగని రీతిలో బలగాలను నింపే ప్రమాదం పొంచి ఉంది. ఈ బలగాలు తెలంగాణవాదులను, తెరాస కార్యకర్తలను స్వేచ్ఛగా తిరగనిస్తాయా అనేది సందేహమే. పోలీసు పహరా మధ్య కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఏదో మేరకు తెరాస నుంచి శాససనభా స్థానాలను కైవసం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించే అవకాశాలున్నాయి.

పది స్థానాల్లో రెండు మూడు సీట్లు తెరాస నుంచి చేజారినా కెసిఆర్ నాయకత్వంపై విమర్శల జడివాన కురిసే అవకాశం ఉంది. పదే పదే రాజీనామాలు చేయడం, చేయించడం అనే కెసిఆర్ ఎత్తుగడను ఇతర పార్టీలు తప్పు పడుతున్నాయి. ఈ ప్రభావానికి ప్రజలు ఏదో మేరకు గురయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షకు, ఎన్నికలకు ముడిపెట్టి కెసిఆర్ పని చేస్తుండడంలో కూడా లోపం ఉంది. ఎన్నికలు వేరు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష వేరనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ప్రజల ఆకాంక్ష పూర్తిగా వ్యక్తమయ్యే అవకాశం లేదు. ఎన్నికల్లో విభిన్న అంశాలు పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల ఈ ఎన్నికలు కెసిఆర్ కు నల్లేరు మీద బండి నడక ఏమీ కాకపోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X