వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలదించుకోవాల్సింది చిరంజీవా, రాజశేఖరా!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
సత్యం, నీతి, నిజాయితీని నమ్ముకున్న నాపై లేనిపోని నిందలు వేశారని, వాటి బలం నిరూపమయిందని, సత్యం నిప్పులాంటిది అని సినీ మెగాస్టార్, రాజకీయ ప్రజారాజ్యం పార్టీ విఫల నేత చిరంజీవి తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. రెండురోజుల క్రితం చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఎలాంటి అవకతవకలు లేవని, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి(నాకో) మార్గదర్శకాలకు అనుగుణంగానే నడుస్తోందని ప్రభుత్వం తరఫున దానం నాగేందర్ ప్రకటించిన తర్వాత చిరంజీవి చేసిన వాఖ్యలు అవి. ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి బ్లడ్ బ్యాంకులోని రికార్డులు, రక్తనిధి, సేకరణ, నిల్వ ఏర్పాట్లు, పరికరాల కొనుగోలు వంటి అన్ని అంశాలపై విచారణ జరిపిన అనంతరం ఎలాంటి దుర్వినియోగం లేదని తేలిందని, నిబంధనలు అతిక్రమించిన సాక్ష్యాధారాలు కూడా లేవని మంత్రి చెప్పారు. అప్పుడు చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కూడా స్పందించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకుపై విమర్శలు చేసిన వారు తలదించుకోవాల్సిన సమయమిది అన్నారు.

అల్లు అరవింద్ ఆ మాటలు పరోక్షంగా రాజశేఖర్ ని దృష్టిలో పెట్టుకొనే అన్నాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే అల్లు అన్నట్లు తలదించుకోవాల్సింది ఎవరు? చిరంజీవా? రాజశేఖరా? చిరంజీవికీ రాజశేఖర్ కి పోలికా. చిరంజీవికి ఉన్న ఇమేజ్ లో పదిశాతం అయినా రాజశేఖర్ కు ఉందా? చిరంజీవి అభిమానులను ప్రభావితం చేసినట్టుగా రాజశేఖర్ చేయగలడా? సినిమాలలోనైనా మరెందులోనైనా చిరంజీవితో రాజశేఖర్ పోటీ పడగలడా అంటే అదీ లేదు.

చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అవకతవకలు లేవని ప్రభుత్వం చెప్పినప్పటికీ బ్లడ్ బ్యాంకు వెళ్లిన చాలామందికి అందులోని అక్కడ జరిగే అవకతవకల గురించి చెప్పాల్సిన పని లేదు. మరి ప్రభుత్వం ప్రకటించడానికి కారణం. వైఎస్ జగన్. రోశయ్య ప్రభుత్వంపై వైఎస్ జగన్ వర్గం నిత్యం విమర్శలు గుప్పిస్తోంది. జగన్ ఇప్పటికే పార్టీ పెడుతాడనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ జగన్ బయటికి వెళ్లిపోయినా? ఎదురు తిరిగినా ప్రభుత్వం పరిస్థితి ఏమిటి? చిరంజీవి రోశయ్య ప్రభుత్వానికి అండగా ఉంటానని ఎప్పుడో చెప్పాడు. ఆ మధ్య సోనియా గాంధీని కూడా కలిసి వచ్చాడు. ప్రజారాజ్యం ప్రభుత్వంతో లోలోపల చెట్టాపట్టాలేసుకొని తిరిగినప్పటికీ ప్రస్తుతానికి ప్రజల్లో ఇమేజ్ పెంచుకోవడానికి మాత్రమే కొద్దిస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జగన్ బయటికి వెళ్లిపోతే కాంగ్రెస్ లో చేరి మంచి పొజిషన్లో ఉండవచ్చన్నది చిరంజీవి కోరికగా ఉంది.

ఇక ప్రభుత్వం రాజకీయాలు చేసి దాసరికి ఉత్తమ నటుడి అవార్డును ఇప్పించిందని చిరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు క్లీన్ చీట్ ఇచ్చి వారి ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. రాజశేఖర్ భార్య జీవిత చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చారిటీ ఎక్కడ చేస్తుందన్న ప్రశ్నలకు ఎవరూ సరియైన సమాధానం ఇవ్వలేకపోయారు. బ్లడ్ బ్యాంక్ లో పనిచేసే నరేష్ వర్మ అనే వ్యక్తి కూడా జీవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు. చివరకు కొందరికి ఫ్రీ, కొందరికి డబ్బులకు అని మాట్లాడాడు. దీంతో చిరంజీవి చేసే చారిటీ ఏంటో తెలుస్తోంది. చారిటీ చేయనప్పుడు ఆ పదాన్ని తీసివేసి అమ్ముకోవచ్చని జీవిత వాదన. ఆరోగ్యానికి హాని చేసే కూల్ డ్రింక్స్ ను తాగమని ప్రోత్సహిస్తూ చిరంజీవితో పాటు, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ ప్రచారం చేస్తున్నారు. కూల్ డ్రింక్స్ లో విషపదార్థాలు ఉన్నాయని వైద్యులు తేల్చినప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ వారిని కూల్ డ్రింక్స్ తాగమని ప్రోత్సహిస్తూ వారి కుటుంబ సభ్యులు మాత్రం కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్నారు. మరి తలదించుకోవాల్సింది ఎవరు...ప్రజల ఆరోగ్యాన్ని, రాజకీయ ఎదుగుదల కోసం చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్న చిరంజీవా? చారిటీపైన ప్రశ్నిస్తున్న జీవితనా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X