వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ ఎన్టీఆర్ ఇంట గెలుస్తాడా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jr Ntr
స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వం విషయంలో ఇతర నందమూరి హీరోలతో పోటీ పడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే చాలా మార్కులు కొట్టేశారు. అచ్చం తాత కవళికలతో పుట్టడం ఆయనకు సినిమాల్లో ప్లస్ పాయింట్ అయింది. దూకుడు కూడా ఆయనకు పనికి వచ్చింది. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు సినీ రంగంలో పదేళ్ల కాలంలో తనదంటూ ఓ ఇమేజ్ ను సృష్టించుకున్నారు. నందమూరి హీరోగా ప్రేక్షుకల మదిలో చోటు సంపాదించుకున్నాడు. రచ్చ గెలిచిన ఎన్టీఆర్ ఇంట గెలుస్తాడా అనేది చూడాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సమీప బంధువు నార్నే శ్రీనివాస రావు కూతురును పెళ్లి చేసుకుంటున్న ఆయన నందమూరి కుటుంబంలోకి ప్రవేశించి వారిలో పూర్తిగా ఒకడిగా మారిపోతారా చూడాల్సిందే. ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు కాదనలేని పరిస్థితిని జూ.ఎన్టీఆర్ కల్పిచుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు ఇప్పుడు ఎవరికీ పరిచయం చేయవలసిన అవసరం లేదు. అయితే పదేళ్ల క్రితం మాత్రం చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి అష్టకష్టాలు పడ్డాడు. అతి చిన్నవయసులోనే స్టార్ గా ఎదిగిన ఓ క్రేజీ స్టార్ జూ.ఎన్టీఆర్. చిత్ర పరిశ్రమకు మొదట్లో వచ్చినప్పుడు ఎవరి అండదండలు లేవు, ఎవరి ఆశిస్సులూ లేవు. ఏ గాడ్ ఫాదర్ లేడు. గాడ్ ఫాదర్ వంటి తండ్రి కూడా దూరంగానే ఉన్నాడు. ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి కుటుంబం నుండి ఎలాంటి ఆసరా లభించలేదు. అయినప్పటికీ ప్రేక్షకులలో ఇంత ఆదరణ, ఇంతమంది అభిమానులను సంపాదించుకొని నందమూరి వంశానికి వారసుడిగా ఎదగడానికి కారణం మాస్ అప్పియరెన్సు, తాత ఎన్టీఆర్ పోలిక, డాన్సు, నందమూరి వంశం. ఇవే ఆయనకు ప్లస్ అయ్యాయి. వీటన్నింటికి మించి జూ.ఎన్టీఆర్ క్రమశిక్షణ, పట్టుదల, కఠిన శ్రమ పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేశాయి. నవరస నటనా సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్, యువరత్న నందమూరి బాలకృష్ణల తర్వాత ఇప్పుడు నందమూరి వంశానికి వారసుడు జూ.ఎన్టీఆరే కావడం విశేషం.

మొదట తనకు ఏ కుటుంబమయితే ఆసరా ఇవ్వలేదో ఆ కుటుంబాన్ని తన దగ్గరకు వచ్చేలా చేసుకున్నాడు. అయితే వారిని ఏనాడు జూ.ఎన్టీఆర్ విమర్శించలేదు. తన చిత్రాల్లో తాత ఎన్టీఆర్ ను, తండ్రి హరికృష్ణను, బాబాయ్ బాలకృష్ణను గుర్తుకు తెచ్చేలా సన్నివేశాలను రూపొందించుకునేవాడు. తన కుటుంబం పట్ల తనకున్న అభిమానాన్ని చిత్రంలోని పాత్రల ద్వారా చూపించేవాడు.నిన్నుచూడాలని నుండి బృందావనం వరకు జూ.ఎన్టీఆర్ కెరీర్ ఏమీ సాఫీగా సాగలేదు. మూడు హిట్లు ఆరు ఫట్లు అన్నట్టు సాగింది. అయితే 1997లోనే జూ.ఎన్టీఆర్ పదమూడేళ్లు ఉన్నప్పుడు ఆయన రాముడిగా బాల రామాయణం వచ్చింది. అది ఘన విజయం సాధించినప్పటికీ అప్పటికీ జూనియర్ ఇంకా చిన్నవాడే. పూర్తిస్థాయి కథానాయకుడిగా మాత్రం నిన్ను చూడాలని. ప్రేమ కథా చిత్రమైన నిన్ను చూడాలని నుండి బృందావనం వరకు విజయవంతమైన చిత్రాలకన్నా మాములుగా అడిన చిత్రాలే ఎక్కువ. అయితే ఎన్టీఆర్ కు స్టార్ డమ్ తీసుకువచ్చిన చిత్రం మాత్రం సింహాద్రి. అంతకుముందే ఆది చిత్రం భారీ విజయం సాధించింది. అలాంటి కథపై బాలకృష్ణ కూడా మక్కువ పెంచుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఎన్టీఆర్ చిత్రాలు మామూలుగా ఆడినా నిర్మాతకు లాభాలే తెచ్చిపడుతాయి. మొదటిసారి తండ్రి కొడుకులుగా ఆంధ్రావాలాలో నటించి అభిమానులను, ప్రేక్షకులను మెప్పించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X