వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ అటాకింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసుపై ఒత్తిడి పెంచుతున్నారు. సమరనాదం పూరిస్తున్నారు. తెలంగాణ నాయకులపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ నాయకులకు ఉన్న నిబద్ధతను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలోని ప్రజాశ్రేణులను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తూనే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై ఒత్తిడి పెంచుతున్నారు.

తమ పార్టీని ఉప ఎన్నికల్లో ఓడించి తెలంగాణ సాధిస్తామని ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెసు నాయకులకు చెప్తారా అని ఆయన కాంగ్రెసు నాయకులను ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీకి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ నివేదిక సమర్పించకపోవడంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ తెలంగాణకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ రకంగా కాంగ్రెసుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల మనోభావాలను తన వైపు తిప్పుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని కాంగ్రెసు నాయకత్వం ప్రకటించినప్పటికీ ప్రస్తుత కెసిఆర్ వ్యూహం వల్ల అది అంత సులభం కాకపోవచ్చు. పైగా, ఉప ఎన్నికలను వాయిదా వేయాలని సీమాంధ్రకు చెందిన న్యాయవాది ఒకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే పరిస్థితి ఉన్నందున ఉప ఎన్నికలను ఇప్పుడు నిర్వహించకూడదని అతను పిటిషన్ లో అన్నాడు. అలాగే, తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలను వాయిదా వేయాలని ప్రజారాజ్యం పార్టీ కూడా కోరుతోంది.ఈ స్థితిలో కెసిఆర్ పరిస్థితులను మరింతగా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X