వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శంకర్ కు కుచ్చుటోపీ

By Pratap
|
Google Oneindia TeluguNews

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలంగాణవాదం గుప్పుమంది. తెలంగాణకు చెందిన దర్శకుడు శంకర్ కు సినీ దర్శకుల మండలిలో స్థానం కల్పిస్తామని చెప్పి మోసం చేశారని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో తెలంగాణ ప్రాంతానికి చెందినవారిపట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ, అదివారం ఓయూ జేఏసీ విద్యార్థులు ఫిలిం చాంబర్‌ను ముట్టడించారు. దర్శకుడు శంకర్‌ను తిరిగి ఏపీ సినీ దర్శకుల మండలికి అధ్యక్షుడిని చేయాలని వారు డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా ఏపీ సినీ దర్శకుల మండలి అధ్యక్షునిగా వ్యవహరించిన శంకర్ పదవీకాలం గతనెలలో పూర్తయింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో శంకర్ పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే సినీ పెద్దలు జోక్యం చేసుకొని నామినేటెడ్ పదవి ఇస్తాం పోటీ చేయవద్దని కోరారు. దీనికి శంకర్ అంగీకరించడంతో దర్శకుడు సాగర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణకు చెందినవారు కాబట్టే శంకర్ ను తెలివిగా పక్కకు తప్పించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో శంకర్ తెలంగాణ తరఫున గట్టిగా మాట్లాడుతున్నారు. మోహన్ బాబు తీరును ఆయన తప్పు పట్టారు. దీంతో శంకర్ పై కోస్తాంధ్రకు చెందిన సినీ ప్రముఖులు కత్తి కట్టి పక్కకు తప్పించారని భావిస్తున్నారు.

ఎన్నికలు పూర్తయి నెలరోజులు పూర్తయ్యాయి. శంకర్ కు ఇచ్చిన హామీని సినీ పెద్దలు పట్టించుకోవడం లేదు. దీంతో తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం ఫిలిం చాంబర్‌లో మండలి సర్వసభ్య సమావేశం జరుగుతుండగా ఓయూ విద్యార్ధి జేఏసీ, కేపీహెచ్‌బీ కాలనీ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు భారీ సంఖ్యలో ఫిలిం చాంబర్ వద్దకు త రలివచ్చి ముట్టడికి ప్రయత్నించారు. పథకం ప్రకారమే కొంత మంది పెద్దలు తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసులు 14మంది జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్ హాల్‌లో సినీ దర్శక సభ్యుల కార్యవర్గ సమావేశం సందర్భంగా తెలంగాణ వాది, దర్శక రచయిత ప్రేమ్‌రాజ్‌పై దాడి జరిగింది. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర సమితి ఖండించింది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడేవారు తీరు మార్చుకోకపోతే తగురీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X