వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రులకో తెలంగాణ విజ్ఞప్తి

By విజయకృష్ణ చాట్ల, జైతెలంగాణ ఫోరం, వాషింగ్టన్ డిసి
|
Google Oneindia TeluguNews

Telangana
భస్మాసురుడు తన హస్తంతో తానే భస్మం చేసుకున్నట్లు ఆంధ్రా స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తన పక్షపాత బుద్ధ్హితో తెలంగాణా శాసనసభ్యుల రాజీనామాలు ఆమోదించి అసెంబ్లీలో కొంత కాలం తెలంగాణా గొడవ లేకుండా ఉండేటట్లయితే చేసినాడు గాని ఆ రాజీనామాలు ఆంధ్రా అక్రమ పాలనకి ఇంత సులువుగా అంతిమ గీతం పాడుతాయని ఎవరూ ఊహించలేదు. ఏరు దాటినంక తెప్ప తగలేసినట్లు 2009 లో వైయస్ రాజశేఖర రెడ్డి నాటకమాడి తెలంగాణా ను నట్టేట ముంచినాడు. ఆపైన ఎన్నికలు ముగుస్తుండగా వెధవ కామెంట్లు చేసినాడు. నీచ ప్రవృత్తిని నిస్సుగ్గుగా చాటుకున్నాడు. కాని తెలంగాణా ప్రజలు అప్పటికే మోస పోయినారు. వారికి 2014 వరకు మళ్ళీ అవకాశం లేక పోయింది. అంతలోనే వైయస్ పోవడం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు నిరాహార దీక్షతో తెలంగాణా ఉద్యమానికి మళ్లీ ఊపిరులూదడం ఇన్నాళ్లూ తొక్కి పెట్టిన ఒక చారిత్రక ఘట్టానికి తెర లేపింది.

నేనే పెద్ద మొనగాన్నని విర్ర వీగిన కిరణ్ కుమార్ అనాలోచితంగా తెలంగాణాకు మరిచిపోలేని మేలే చేశాడు. ఆయనకు తోడు కాంగ్రెస్స్, తెలుగు దేశం పార్టీ రెండూ రాజీనామాలు చేయకుండా, పోటుగాళ్ళ లాగా ఎలెక్షన్ లలో నిలబడి తెలంగాణా కి సరిదిద్దుకోలేని మేలు చేశారు. వారు పెద్ద గోతిని తవ్వి దానిలోనే పడి బయటకు వచ్చే దారి లేకుండా చేసుకున్నారు. పోటీ చేయక పోయినా తెలంగాణకు మేమూ అనుకూలమని చెప్పుకుని తెలంగాణా ప్రజలని ఎప్పటిలాగానే మోసం చెయ్యగలిగే వాళ్ళు. ఇప్పుడు అది కూడా పోయింది. కాంగ్రెస్స్, తెలుగు దేశం మోసమే చేస్తాయని ఎలా వోటర్లని ఈ పార్టీ ల మోసాల్నుంచి కాపాడాలో తెలియని మాకు ఒక రాజ మార్గం చూపించారు. వేల కృతఙ్ఞతలు. ఇప్పుడేమో ఏమీ చేయలేక సొల్లు మాటలు మాట్లాడుతున్నారు. మేం కూడా ప్రత్యేక రాయలసీమ కోసమా రాజీనామా చేస్తే బ్రహ్మాండమైన మెజారిటీ తో గెలిచే వాళ్ళమని, మనిషి కుక్కని కరిస్తే వింత అని, కుక్క మనిషిని కరిస్తే వింత కాదని, వారి సీట్లు వారు గెలుచుకోవడం వింత కాదని, 2014 లో మళ్ళీ పుంజుకుంటామని తప్పుడు మాటలు చెబుతున్నారు. అసలు కుక్క వీళ్లను కరిచినట్లుంది.

ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటం చేస్తామనే వాళ్లకి మేమేం చెప్తున్నామో అర్థం కానట్లుంది. మేమూ అదే విడిపోదామనే చెప్తుంది. దోపిడీలు, దౌర్జన్యాలు ఇంకా ఎన్నాళ్ళో సాగవు. ప్రపంచాన్నంతటినీ ఆక్రమించిన బ్రిటిష్ వాళ్ళనే వెళ్ల గొట్టాం మనం. ఒక నిజాం నవాబుకి వ్యతిరేకంగా ఏళ్ళ తరబడి పోరాడాం. ఒక ఆంధ్రా ఆక్రమణ దాని ముందు ఎంత. బ్రిటిష్ వాళ్లకి పట్టిన గతే వీళ్ళకూ పడ్తుంది. కాకపొతే పాపాలు ఇప్పుడే పండినాయి. ఇక అయి పోయింది.

ఒక జాతిని మరొక జాతి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ పీడించే సంస్కృతి ఇంకానా, ఇకపై సాగదు - శ్రీ శ్రీ అనే ఒక ఆంధ్రా కవి చెప్పిన ఈ మాటలు తెలంగాణా విషయం లో సరిగ్గా సరిపోతాయి. ఆంధ్రా మిత్రులారా కళ్ళు తెరవండి. దోపిడీ, దౌర్జన్యం ఎన్నాళ్ళో సాగవు. మూలకు నెడితే, సర్వస్వం దోచుకుంటే పిల్లి అయినా తిరగబడుతుంది. అబద్ధాలు, నక్క జిత్తులు ఎంతో కాలం మోసం చేయ లేవు. ఇది ఆంధ్రా వారి తెలంగాణా ఆక్రమణకు చరమ గీతం. తెలంగాణా ప్రజలు మేమూ మనుషులమే అని గొంతెత్తి అరుస్తున్నారు. మా రాజ్యాన్ని మీరు అక్రమించుకుని మాకు తిండి లేకుండా దోచుకోవడం అన్యాయం ఇకపై సాగదని ఆక్రోశిస్తున్నారు. వారి ఆపేక్షలని వినండి. మనుష్యుల్లా ఇప్పటికైనా ఇంకొకరి ఆవేదనని అర్ధం చేసుకోండి. వారి ఆకాంక్షలకి విలువివ్వండి. మనమందరం ఒక మంచి మిత్రులుగా రెండు విడి రాష్ట్రాలుగా 1952 నుండి 1956 వరకు ఎలా వుండే వారిమో అలాగే మళ్ళీ ఉందాం. ఆంధ్ర వాళ్ళు, ఆ మాటకొస్తే దేశంలోని అన్ని ప్రాంతాల వారు తెలంగాణా లో పెట్టుబడులు పెట్టొచ్చు. అటు ఆంధ్రా అభివృద్ధికి, ఇటు తెలంగాణా అభివృద్ధికి పాటు పడొచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X