వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధిష్టానం వద్ద బొత్స, కిరణ్ చెరో మాట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana-Kiran Kumar Reddy
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ సకల జనుల సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ అధిష్టానం వద్ద వేరు వేరుగా తమ వాదనలు వినిపించినట్లుగా సమాచారం. నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేక పోవటంతో ఉద్యోగ వర్గాల్లో నిరాశ నెలకొందని, వారు అలసిపోయి సమ్మె విరమించేందుకు సిద్దపడ్డారని కానీ అంతమాత్రాన వారి స్ఫూర్తిని తక్కువగా అంచనా వేయడానికి వీలులేదని బొత్స అధిష్టానం వద్ద చెప్పారని తెలుస్తోంది. ఉద్యోగులు ప్రస్తుతానికి వెనక్కి తగ్గినా భవిష్యత్తులో మళ్లీ సమస్యలు సృష్టించే అవకాశముందని, రాజకీయంగా పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యలు తీసుకోనంత వరకు తెలంగాణ రాజుకుంటూనే ఉంటుందని అధిష్టానం వద్ద అభిప్రాయపడ్డారట.

ఉద్యోగులు సకల జనుల సమ్మె విరమించాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ప్రకటన వెనుక బొత్స చొరవే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆదివారం సమ్మెపై ప్రకటన చేయాలని కోరినప్పటికీ బొత్స అంతకుముందు రోజే విజ్ఞప్తి చేశారని వార్తలు వచ్చాయి. అయితే సిఎంతో ఆజాద్ భేటీ అయి కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రకటన చేశారని తెలుస్తోంది. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి వస్తుందని ముందున్నంత తీవ్రత ఇప్పుడు లేదని కొన్ని రాజకీయ చర్యల ద్వారా పరిస్థితిపై పట్టుబిగించవచ్చునని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా తెలుస్తోంది.

కేంద్ర హోంమంత్రి చిదంబరంతో జరిగిన భేటీలో భద్రతా దళాలు కొన్ని సందర్భాలలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చినప్పటికీ సంయమనంతో వ్యవహరించడం వల్లనే సమ్మెలో అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, తాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని, మంత్రుల బృందాన్ని నెలకొల్పి ఉద్యోగులతో చర్చలు జరిగేలా చూశానని చెప్పినట్లు తెలుస్తోంది. సమ్మెపై సామ, దాన, భేద, దండోపాయాలను సరైన రీతిలో ఉపయోగించినందు వల్లే పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని సిఎం చెప్పినట్లుగా తెలుస్తోంది.

English summary
It seems, PCC chief Botsa Satyanarayana and CM Kiran Kumar Reddy told high command about telangana sakala janula strike in different versions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X