వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారా చంద్రబాబు జాక్‌పాట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాక్‌పాట్ కొట్టినట్లే భావించాలి. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అదనంగా రెండు సీట్లు వచ్చాయి. ఎన్నికలు జరిగిన 9 స్థానాల్లో ఎనిమిది స్థానాలు కాంగ్రెసు పార్టీవి కాగా ఒకటి మాత్రమే తెలుగుదేశం పార్టీకి చెందింది. కాంగ్రెసు నుంచి వైయస్ జగన్ విడిపోయి వేరుగా పోటీకి దిగడంతోనే కాకుండా కాంగ్రెసులోని విభేదాల వల్ల కూడా చంద్రబాబు లాభపడ్డారు. అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

అనంతపురం జిల్లా విజయం వెనక చంద్రబాబు గొప్పదనం గానీ, తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం గానీ లేదు. ఇక్కడ తెలుగుదేశం బలం పెరిగిందని చెప్పడానికి కూడా ఏమీ లేదు. కేవలం కాంగ్రెసులోని అంతర్గత విభేదాల వల్లనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి విజయం సాధించారు. కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వర్గం సహకరించడం వల్ల కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఓడిపోయి, ఆయన గెలిచారు. అందువల్ల ఇందులో చంద్రబాబు సంతోషించాల్సింది ఏమీ లేదు. శాసన మండలిలో తమ బలం పెరిగిందని చెప్పుకోవడానికి పనికి వస్తుంది.

కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ జగన్ వర్గం, కాంగ్రెసు పార్టీ మధ్య విభేదాల వల్లనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంగర రామ్మోహన్ గెలిచారు. అయితే, వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించడం వల్ల భవిష్యత్తులో తాము లాభపడతామనే అంచనాకు చంద్రబాబు రావడానికి మాత్రం వీలుంది. అందులో కొంత వాస్తవం లేకపోలేదు.

నేరుగా ప్రజలు ఓటేసే ఎన్నికలు కాకపోవడం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలు అంశాలు ప్రభావం చూపుతాయి. డబ్బులు ప్రధాన పాత్ర వహిస్తాయి. క్యాంపుల నిర్వహణ కూడా పనిచేస్తుంది. వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఎన్నికల ఆధారంగా పార్టీల బలాబలాలను అంచనా వేయలేం. కానీ, చంద్రబాబుకు ఏదో మేరకు ఈ ఫలితాలు ఉత్సాహాన్ని ఇచ్చేవే.

English summary
TDP president N Chandrababu Naidu may increase his confidence with winning 3 MLC seats held in Locals Bodies constituencies. TDP won the election with the split between YS Jagan camp and Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X