హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'కిరణ్‌కు తెలంగాణ సెగ వద్దు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ ప్రాంత కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు కొత్త విధానం ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు తెలంగాణ సాధన కోసం ఉద్యమిస్తూనే మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించకుండా ముందుకు సాగే ప్రణాళిక తయారు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ అంశం రాష్ట్రం చేతిలో లేనందున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయకుండా తెలంగాణ సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై, అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చే విధంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం జరిగే సమావేశంలో దీని పైనే ప్రధానం చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో ముఖ్య విషయమేమంటే ఈ పంథాలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కావడం విశేషం. అంతేకాదు తమతో పాటు సీనియర్లను కూడా తీసుకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.

దీంతో సమావేశానికి సీనియర్ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించాలని యోచిస్తున్నారు. ఉద్యమం నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారంటున్నారు. అందువల్ల ప్రజా ప్రతినిధులుగా సమస్యలను పరిష్కరిస్తూనే తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చాలని కృతనిశ్చయంతో ఉన్నామంటున్నారు. ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు, మౌలికా సదుపాయల కల్పనలో కూడా భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కనుక పదవులకు రాజీనామా, సకల జనుల సమ్మె, నిరాహార దీక్ష తదితర రూపాల్లో ఒత్తిడి తెచ్చామని, ఇంతకన్నా ఏమి కావాలని వారు ప్రశ్నిస్తున్నారు.

ఈ నిరసనలతో కేంద్రం కదిలిందని, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. ఈ సమయంలో రాష్ట్ర పరిధిలో లేని అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ లక్ష్యంగా విమర్శలకు దిగడం, ప్రభుత్వానికి సహకరించకపోవడం సరికాదని చెబుతున్నారు. అయితే, నవంబర్ 1న రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొనడం సరికాదని అత్యధిక ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇంకా విభజన జరగనందున పాల్గొన్నప్పటికీ నష్టమేమీలేదని కొందరు వాదిస్తుండటంతో వారిని కూడా వేడుకలకు దూరంగా ఉంచేలా నచ్చజెప్పాలని నిర్ణయించుకున్నారు. కాగా, సంక్షేమ కార్యక్రమాల అమలుకు దోహదపడే రచ్చబండలో పాల్గొనాలని అధికశాతం ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం శాసనసభ్యులు భేటీ కానున్నారు. సీనియర్ శాసనసభ్యుల మద్దతు పక్కన పెడితే తెలంగాణ మంత్రుల మద్దతు మాత్రం వీరికి ఖచ్చితంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయకుండా తెలంగాణ కోసం ఉద్యమించడమే మేలని పలువురు మంత్రులు ఎప్పటి నుండో భావిస్తున్నారు. అందుకే ఎంపీలు నిత్యం మంత్రులు రాజీనామా చేయాలనే డిమాండ్ వారికి రుచించడం లేదు. మంత్రి బస్వరాజు సారయ్య కూడా గురువారం ముఖ్యమంత్రిగా కిరణ్ రాష్ట్రంలో అంతటా పర్యటిస్తారని చెప్పారు. త్వరలో సిఎం పర్యటనలో ఎమ్మెల్యేలూ ఖచ్చితంగా పాల్గొనే అవకాశముంది.

English summary
It seems, Telangana Congress new elected mlas are going with different strategy on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X