వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా రాజకీయం: ఫిక్స్‌లో దేవినేని నెహ్రూ

By Pratap
|
Google Oneindia TeluguNews

Devineni Nehru
కృష్ణా జిల్లా కాంగ్రెసు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ప్రజారాజ్యం పార్టీ విలీనంతో కాంగ్రెసు నాయకుడిగా మారిపోయిన వేదవ్యాస్ నుంచి విజయవాడ కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూ చిక్కుల్లో పడినట్లు అర్థమవుతోంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుల వేటలో పడ్డారు. ఇందులో భాగంగా కృష్ణా డిసిసి అధ్యక్షుడిగా దేవినేని నెహ్రూను ముందుకు తేవాలనే ఆలోచన ఆయన ఉన్నారు. ఈ విషయం ఆయన దేవినేని నెహ్రూకు కూడా చెప్పారు. కానీ, ఆ పదవిని స్వీకరించడానికి దేవినేని నెహ్రూ మొదట్లో విముఖత ప్రదర్శించారు. తన అల్లుడు సాయికృష్ణకు ఉడా పదవి ఇప్పించాలనే ప్రయత్నాలను ఆయన ముమ్మరంగా సాగిస్తూ డిసిసి పదవి చేపట్టడానికి ఆయన ఇష్టపడడం లేదని అంటున్నారు.

దేవినేని నెహ్రూకు నచ్చజెప్పడానికి విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తదితరులు విస్తృతంగానే ప్రయత్నాలు చేశారు. తనకు సమీప బంధువైన దేవినేని ఉమా మహేశ్వర రావు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. దాంతో డిసిసి పదవి చేపడితే ఆయనను ఎదుర్కోవాల్సి వస్తుందని నెహ్రూ వెనకాడినట్లు చెబుతున్నారు. దాంతో పాటు డిసిసి అధ్యక్ష పదవి తనకు తగింది కాదనే భావన కూడా ఆయనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో వేదవ్యాస్ పేరు డిసిసి అధ్యక్ష పదవికి ముందుకు వచ్చిందని సమాచారం. వేదవ్యాస్ ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

వేదవ్యాస్ డిసిసి అధ్యక్ష పదవి చేపడితే గత ప్రజారాజ్యం పార్టీ నాయకులకు కృష్ణా జిల్లాలో ప్రాధాన్యం పెరుగుతుందనే భావనకు ఇప్పుడు దేవినేని నెహ్రూ ఆలోచన పడ్డారని అంటున్నారు. పైగా, తన సామాజిక వర్గానికి ప్రాధాన్యం తగ్గిపోతుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో దేవినేని నెహ్రూ ఉన్నారని అంటున్నారు. మొత్తం మీద, కృష్ణా కాంగ్రెసు రాజకీయాలు వేడిగానే సాగుతున్నాయి.

English summary
It is said that Congress leader Devineni Nehru is in fix due to the turn of Congress Krishna district politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X