వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందాలతో అదరగొట్టిన పాక్ హీనా రబ్బానీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hina Rabbani Khar
ప్రస్తుతం భారత మీడియా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌పై దృష్టి కేంద్రీకరించింది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో తర్వాత అంతగా రాజకీయాల్లో క్లిక్ అయిన మహిళ హీనాయే అనటంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఎందరో విదేశాంగ మంత్రులు వచ్చారు, వెళ్లారు. కానీ ప్రచార సాధనాలు మాత్రం ఎవరికీ ఇంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కారణం చిన్న వయసులోనే రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదగటం, నగు మోము అందాలు, ఆకట్టుకునే సౌందర్యం. మూడు పదుల వయస్సులోనే పాకిస్తాన్ రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలకు హీనా ఎదిగింది. ఆమె అందం, రాజనీతి చూస్తుంటే సొగసు, రాజకీయం ఒకే ఒరలో ఇమిడినట్లుగా కనిపిస్తోంది. హీనా చాలా చురుకైన యువతి. ఎక్కడ మౌనం వహించాలో, ఎక్కడ మాట్లాడాలో ఆమెకు తెలుసు.

ఆకట్టుకునే అందం, రాజకీయాల్లో చురుకుదనం కలగలిపి ఉండటంతో సాధారణంగానే భారత మీడియా ఆమెపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆమె ముఖాన్ని మొదటి పేజీలో వేయడానికి పత్రికలు పోటీ పడుతున్నాయనే చెప్పవచ్చు. ఆమె వేసుకున్న డ్రస్ రంగు నుండి కాలికి వేసుకున్న చెప్పుల వరకు భారత మీడియా విశ్లేషిస్తోందంట. తన రాజకీయ నీతితో పాక్‌లో ప్రశంసలు పొందింది. హీనా తండ్రి ప్రముఖ రాజకీయ వేత్త. సంప్రదాయ భావాలు గల కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఆమెలో ఆధునిక భావాలకు ఏమాత్రం కొదువ లేదు. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్‌మెంట్ విద్యనభ్యసించిన హీనా ఆ తర్వాత రెస్టారెంట్ల నిర్వహణను చేపట్టారు. రాజకీయాల్లోకి రాకముందు ఉద్యోగం చేసింది. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి ఇరవై నాలుగేళ్ల చిన్న వయస్సులో రాజకీయ ఆరంగేట్రం చేశారు. ముషారఫ్ పాక్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో పాలనలో అనేక సేవలు అందించింది. వివిధ ఆర్థిక విభాగాల్లో పని చేసింది. పాక్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తొలి మహిళ కూడా హీనానే. ఇప్పుడు తొలి విదేశాంగ మంత్రి ఆమెనే. ఆమె ఆలోచనలు, ఆచరణలు ఎప్పుడూ ఆధునికంగానే ఉంటాయి. మెడలో ముత్యాల హారం ధరించి చేతిలో లక్షల ఖరీదు చేసే హ్యాండ్ బ్యాగ్‌తో కనిపిస్తారు.

సంప్రదాయ మహిళ కనిపిస్తోన్న హీనా పార్టీలప్పుడు జీన్స్ వేసి సందడి కూడా చేస్తుందంట. అందుకే వికీపీడియా ఆమెను పాక్ ప్రభంజనంగా పేర్కొంది. ఆమెకు ఫేస్ బుక్ అకౌంట్ కూడా ఉంది. అందులో అభిమాన సంఘాలు ఉండటం విశేషం. పర్వాతరోహణ చేసి సాహస నారిగా పేరు పొందింది. కె2, నంద ప్రభాత్ శిఖరాలను అధిరోహించింది. తక్కువగా మాట్లాడుతూనే ఎక్కువ అర్థమయ్యేలా విషయాన్ని స్పష్టంగా సూటిగా చెప్పడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఎందులోనూ రాజీ పడకుండానే వ్యవహారాలు చక్కబెడుతుంది. ఆమెలో అద్బుత ప్రతిభ ఉన్నందునే అమెరికా, భారత్‌తో వ్యవహారాలు నడపడానికి ఆమెను విదేశాంగ మంత్రిగా ఎన్నుకున్నట్టుగా కనిపిస్తోంది. హీనా కేవలం పాఠాలు చదివి వదిలేసే రకం కాదంట. వాటి లోతుపాతులు తెలుసుకోని అలాంటి సమస్యలు వస్తే ఏం చేయాలో ఆలోచిస్తుంటుందంట. అయితే రాజకీయాల్లో బాగా రాణిస్తున్న హీనాకు పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రాజకీయాలతో పాటు హీనా ఇంటి బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తుందంట.

English summary
Bharat media praising Pakistan foreign minister Hina Rabbani Khar. Active and beauty is impressing Indian media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X