వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాస అధినేత కెసిఆర్‌పై మరోసారి 'కారు'మబ్బులు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చుట్టూ మరోమారు కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి. తాను చేసిన ప్రకటనే తనను ఇబ్బందుల్లో పడేసే స్థితిని తెచ్చి పెట్టింది. ఆయన యథాలాపంగా అన్నారో, వాస్తవం తెలిసే మాట్లాడారో తెలియదు గానీ 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదనీ, ఎన్నికలకు సిద్ధఫడాలనీ సూచించే విధంగా ఆయన ప్రకటన చేశారు. దీనిపై తెలంగాణకు చెందిన కొంత మంది నాయకులు తీవ్రంగా విరుచుకుపడడం మాట అటుంచితే ఉస్మానియా విశ్వవిద్యాలంయ ఐక్య కార్యాచరణ కమిటీ (ఒయు జెఎసి) నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై ఒయు జెఎసి కెసిఆర్‌కు ఓ బహిరంగ లేఖ రాసింది.

కెసిఆర్ ప్రకటనను తప్పు పడుతూ ఒయు జెఎసి నాయకులు ఆ లేఖ రాశారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం ఎదురు చూస్తున్నారు తప్ప 2014 ఎన్నికల కోసం కాదని వారన్నారు. ఎన్నికలతో ముడిపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాన్ని వాయిదా వేయవద్దని వారు సలహా ఇచ్చారు. కాంగ్రెసు 2014లో దొరకదా అంటూ కెసిఆర్ చేసిన ప్రకటన ఉద్యమాన్ని నీరు గార్చే విధంగా ఉందని వారు విమర్శించారు. రెండు వారాల్లో తెలంగాణ వస్తుందని కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు దీక్షా శిబిరంలో కెసిఆర్ చేసిన ప్రకటనను, తెలంగాణ ఇవ్వకపోతే విషం తాగి చస్తానని చేసిన వ్యాఖ్యను వారు తప్పు పట్టారు. కెసిఆర్ లాంటి నాయకులు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

కాగా, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుల కృషితో ఏర్పడిన తెలంగాణ సాధన సమన్వయ కమిటీ కూడా కెసిఆర్‌కు తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి. కెసిఆర్ అందరినీ కలుపుకుని వెళ్లడం లేదనే అభిప్రాయంతో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి తెలంగాణ పెద్దలు ఈ వేదికకు నాయకత్వం వహిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈ వేదిక దూకుడుగానే వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని తట్టుకోవడానికి కెసిఆర్ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. తన వ్యూహానికి పదును పెట్టి ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది.

English summary
TRS president K Chandrasekhar Rao is facing trouble again with his statement from Telangana students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X