వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీరిన వైయస్ జగన్ భయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ భయం తీరినట్లే. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోస్తారని భయపడిన కాంగ్రెసు నాయకత్వం ఇప్పుడు జగన్ వల్ల ఏమీ కాదనే నిర్ణయానికి వచ్చింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తన దయాదాక్షిణ్యాల మీదనే మనుగడ సాగిస్తోందని ఢిల్లీ జలదీక్షలో వైయస్ జగన్ ప్రకటించి తీవ్ర సంచలనం కలిగించారు. నిజంగానే ఆయన ప్రభుత్వాన్ని కూలుస్తారా అనే సందేహం తలెత్తింది. అయితే, క్రమక్రమంగా వైయస్ జగన్ బలం తగ్గిపోతూ వస్తోందనే నిర్ధారణకు సోనియా గాంధీ వచ్చినట్లు కనిపిస్తున్నారు. దీంతో జగన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెసు అధిష్టానం వచ్చింది. ఆ కారణంగానే వైయస్ జగన్ ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై వారం రోజులు దీక్ష చేసినా జగన్‌ను కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు. దీంతో వైయస్ జగన్ వర్గం తీవ్ర అసహనానికి గురైంది. ఆ కారణంగానే ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించింది.

కాగా, వైయస్ జగన్ వెంట వెళ్లే శాసనసభ్యుల సంఖ్యపై కూడా సోనియా గాంధీకి స్పష్టమైన అంచనా వచ్చేసిందని అంటున్నారు. జగన్ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ దీక్ష విరమణ సభకు 23 మంది శాసనసభ్యులు, ఓ పార్లమెంటు సభ్యుడు హాజరయ్యారు. 23 మంది శాసనసభ్యుల్లో 19 మంది కాంగ్రెసు పార్టీకి సంబంధించినవారు. ఇద్దరు ప్రజారాజ్యం పార్టీకి, మరో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. వీరి వల్ల ప్రభుత్వం పడిపోయే స్థితి ఏమీ రాదు. ఈ లెక్కన చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజారాజ్యం పార్టీకి చెందిన 16 మంది శానససభ్యులతో కలుపుకుని సుస్థిరంగా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి దాదాపు 155 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. జగన్ దీక్ష విరమణ సభకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి హాజరయ్యారు. మరో పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి రాలేదు. జగన్ వెంట ఎంత చూసుకున్నా వీరిద్దరు పార్లమెంటు సభ్యులు మాత్రమే ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుత స్థితి చూస్తుంటే, శాసనసభ్యులు లేకున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోయినా వైయస్ జగన్‌కు ప్రజల మద్దతు ఉందని ఆయన వర్గం నాయకులు చెబుతున్నారు. అయితే, క్రమక్రమంగా ఆ మద్దతు కూడా తగ్గుతూ వస్తుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. ఈ స్థితిలో వైయస్ జగన్‌ను విస్మరిస్తేనే తమకు లాభం ఉంటుందని కాంగ్రెసు నాయకత్వం భావిస్తోంది. ఏమైనా, వైయస్ జగన్ సమస్య నుంచి సోనియా గాంధీ గట్టెక్కినట్లేనని చెప్పవచ్చు. తెలంగాణ సమస్య మాత్రమే ఇప్పుడు సోనియాకు కొరకరాని కొయ్యగా తయారైంది.

English summary
AICC president Sonia Gandhi got relief from YS Jagan issue. It is said that Sonia got clear estimation on YS Jagan's strength. Only 19 MLAs are supporting from Congress. It is not easy to topple Kiran Kumar Reddy's government with that strength, it is said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X