వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికీలీక్స్: వైయస్ పాలనలో అవినీతి బారెడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో భారీ అవినీతి జరిగిందని చెన్నైలోని అమెరికా దౌత్య కార్యాలయ అధికారులు అమెరికాకు నాలుగేళ్ల క్రితం పంపిన కేబుల్స్‌ను వికీలీక్స్ విడుదల చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని అధికార కాంగ్రెసు పార్టీ సామాన్య జీవిని లక్ష్యంగా చేసుకొని సంక్షేమ పథకాల కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, సంక్షేమ పథకాల మాటున భారీ అవినీతికి పాల్పడుతోందని 2007లో చెన్నై కాన్సులేట్ అమెరికాకు పంపింది. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరగడమన్నది ఆంధ్ర ప్రదేశ్‌లో బహిరంగ రహస్యమే అని పేర్కొన్నారు. వైయస్సార్ హయాంలో పలు పథకాల పేరుతో భారీ అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. వైయస్ హయాంలో భారీ అక్రమాలు జరిగినట్లు తాము హైదరాబాదులో పర్యటించిన సమయంలో విన్నట్టు చెన్నై కాన్సులేట్ అధికారులు అమెరికాకు నివేదిక పంపించారు.

వైయస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే అమెరికా అధికారులు ఇక్కడి అవినీతిని గుర్తించింది. హైదరాబాదులో పర్యటించిన చెన్నై కాన్సులేట్ అధికారులు కరప్షన్ ప్లేగ్స్ ఆంధ్రప్రదేశ్ బిగ్ టికెట్ స్పెండింగ్ ప్రోగ్రామ్స్ పేరిట ఒక నివేదికను తయారు చేసింది.ఎపిలో అధికార కాంగ్రెసు పార్టీ సగటు జీవిని లక్ష్యంగా చేసుకొని సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఈ పథకాలు రాజకీయంగా ఆదరణ పొందుతున్నప్పటికీ వైయస్ ప్రభుత్వం భారతదేశంలో మునుపెన్నడూ లేనంత అవినీతికి పాల్పడుతోందన్న అర్థంలో నివేదిక ఉందని తెలుస్తోంది. నీటి పారుదల ప్రాజెక్టులు తదితర పథకాల్లో భారీ అవినీతి జరిగిందనిఅప్పట్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్‌పై అవినీతిపై బాగా విమర్శలు చేశారని చెప్పారు. వైయస్ సైతం అంతే స్థాయిలో బాబుపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే.

పథకాల్లో అవినీతిపై రాష్ట్రమంతా ఏకాభిప్రాయంతో ఉందని కాన్సులేట్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రజలకు భారీగా లబ్ధి చేకూరుతుండటంతో ప్రజలెవరూ అవినీతిని పట్టించుకోరని వైయస్ భావించినట్లుగా అందులో పేర్కొన్నారు. సంక్షేమ పథకాల మాటున వైయస్ అవినీతిని ఉన్నత వర్గాలు చీదరించుకున్నాయన్నారు. గణనీయమైన నిధులు అవినీతి కింద తరలిపోయినా కూడా ఎక్కువ మొత్తం డబ్బు సగటు జీవికి కూడా చేరేలా రూపొందించారని పేర్కొన్నారు. ఈ సంగతి దృష్టిలో పెట్టుకొన్న కాంగ్రెసు ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉంది. అవినీతి అన్నది టిడిపికి ప్రధాన ఆయుధం కాబోదని భావిస్తోందని నివేదికలో పేర్కొన్నారు.

English summary
Wikileaks revealed that big corruption in late YS Rajasekhar Reddy ruling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X