వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులు వస్తారా? ముఖం చాటేస్తారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
ప్రత్యేక తెలంగాణ సాధనలో భాగంగా దాదాపు నలభై ఐదు రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మె వాయిదా పడటంతో తెలంగాణ ప్రాంత మంత్రులు సచివాలయానికి వస్తారా? లేరా? అనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు తెలంగాణ ప్రాంత మంత్రులు సచివాలయానికి రావడానికి సాహసించ లేక పోయారు. వచ్చినా సచివాలయ ఉద్యోగులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారిలో చాలామంది ఇంట్లో నుండి విధులు నిర్వర్తించారు. అయినప్పటికీ తెలంగాణ మంత్రుల శాఖలకు చెందిన ఫైళ్లు ఇప్పుడు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. దీంతో వారి రాక వస్తారా రారా అనే అంశం హాట్ టాపిక్‌గా మారి పోయింది.

మంత్రులు వందల కొద్ది ఫైళ్లను క్లియర్ చేయాల్సి ఉంది. సచివాలయ ఉద్యోగులు కూడా మంత్రులను ఇక నుండి అడ్డుకోమని చెప్పారు. దీంతో వారు సచివాలయం వచ్చి ఫైళ్లు క్లియర్ చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. దాదాపు రెండు నెలల నుండి ఆయా శాఖలలో ఫైళ్లు మూలన పడి ఉన్నాయి. దీపావళి హడావుడి ముగియడంతో మంత్రులు సచివాలయానికి వచ్చి ఫైళ్లు క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇటీవల మంత్రులకు సూచనలు చేశారు.

అయితే ఉద్యమ తీవ్రతను గమనించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిగిన కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. వారు అధిష్టానానికి పెట్టిన డెడ్ లైన్ మరీ దూరంగా లేక పోవడంతో స్టీరింగ్ కమిటీ ప్రకటన స్వాగతించి మంత్రులు రాజీనామాలు చేసి వస్తారా? లేక మంత్రులుగానే కొనసాగుతారా? అలా కాకుండా డెడ్ లైన్ వరకు పని చేస్తారా? అనే విషయం ముందు ముందు తేలనుంది.

English summary
Will Ministers come to secretariate? or participate in stearing committee activities will know soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X