వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై సోనియా గాంధీ దిగివస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
రాజీనామాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు మొండికేస్తున్న స్థితిలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ దిగివస్తారా అనే చర్చ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ నుంచి కె. కేశవరావు, ఇతర తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణకు చెందిన మంత్రులతో మాట్లాడుతున్నారు.

రాజీనామాల విషయంలో పట్టు వీడబోమని అంటున్న పార్లమెంటు సభ్యుల ఒత్తిడికి సోనియా గాంధీ తలొగ్గుతారా అనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది. తెలంగాణ ఇస్తామని చెప్తే తప్పితే తాము వెనక్కి తగ్గబోమని తెలంగాణ పార్లమెంటు సభ్యులు గట్టిగానే చెబుతున్నారు. అయితే, సోనియాకు అది అంత సులభమైన విషయం కాదు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు కాంగ్రెసు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా ప్రతివ్యూహం రూపొందిస్తున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సోనియా తలొగ్గితే సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేసే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని అధిగమించడం సోనియా గాంధీకి అంత సులభమేమీ కాదు.

నిజానికి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ నోటి వెంట సోనియా మనోగతం బయటపడిందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటనకు ముందటి వాదనను, ఇంకా చెప్పాలంటే - 2004 ఎన్నికలకు ముందటి వాదనలను ఆజాద్ ముందుకు తెచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ విషయంలో సంభవించిన పరిణామాలను ఆయన గుర్తించకుండా మాట్లాడారు. ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు జరగాలనే మాట ఆయన అన్నారు. అందువల్ల, తెలంగాణ రాష్ట్రం ఇస్తామనే హామీ కాకుండా ఏం చెప్పి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులను సోనియా తన దారికి తెచ్చుకుంటారనేది ఆసక్తికరమైన విషయమే.

English summary
It is not easy to Congress president Sonia gandhi to yield to Telangana region leaders pressure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X