వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గీత'పై ప్రమాణం చేయనున్న హవాయి విన్నర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tulsi Gabbard
అమెరికన్ కాంగ్రెసులో అడుగుపెట్టనున్న తొలి అమెరికన్ హిందువుగా రికార్డ్ సృష్టించిన తులసీ గబార్డ్ వచ్చే జనవరిలో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత పైన ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. హవాయి నుండి జపాన్‌లో జన్మించిన మాజీ హిరానో మాత్రమే కాకుండా డెమోక్రాట్ల అభ్యర్థిగా తులసీ గబార్డ్ కూడా గెలుపొందారు.

హవాయి నుండి ఆమె బరిలోకి దిగి తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కే క్రోలేపై ఘన విజయం సాధించారు. ఆమెరికన్ నమోవాలో కేథలిక్ తండ్రికి, హిందూ తల్లికి జన్మించిన తులసి గబార్డ్ తల్లికి చెందిన హిందుత్వాన్నే స్వీకరించారు. ఆమె 2002లోనే 21 ఏళ్ల చిన్న వయస్సులో హవాయి రాష్ట్ర శాసనసభకు ఎన్నికై రికార్డ్ సృష్టించారు.

31 ఏళ్ల తులసీ గబార్డ్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అమెరికా ఎన్నికల్లో గెలిచిన వారు జనవరిలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ సమయంలో తులసీ భగవద్గీతపై ప్రమాణం చేస్తారు. భగవద్గీతలోని తనకు ఇష్టమైన శ్లోకాలతో ఆమె ప్రమాణం చేయనున్నారట. తన గెలుపు భారత దేశం, అమెరికా మధ్యల మరింత అనుబంధానికి తోడ్పడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా మిన్నెసోట్టా నుండి గెలిచిన కేత్ ఎలిషన్ ఖురాన్ పైన ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా గత వారం సాధారణ ఎన్నికలు ఉన్నా లెక్క చేయకుండా డల్లాస్‌లోని హిందూ, ఇండియన్ - అమెరికన్ నేతలను కలుసుకోవడానికి వచ్చిన తులసీ మాట్లాడుతూ తాను భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు.

బాల్యం నుంచే హిందూ సంస్కృతిని ఆచరిస్తూ శాకాహారి మాత్రమే అయిన గబ్బర్డ్ భారత సంతతికి చెందినవారు కారు. ఆమె తండ్రి మైక్ గబ్బర్డ్ కాథలిక్ క్రిస్టియన్. ప్రస్తుతం హవాయి స్టేట్ సెనేటర్‌గా ఉన్నారు. ఆయన అమెరికన్ సమోవాకు చెందినవారు. ఆమె తల్లి కరోల్ పోర్టర్ గబ్బర్డ్ శ్వేత జాతి అమెరికన్ మిచిగాన్ స్టేట్‌కు చెందినవారు. ఆమె హిందూ ఆచారాలను పాటిస్తున్నారు.

ఆ దంపతులు తమ ఐదుగురు పిల్లలను కర్మయోగ విలువ ప్రాధాన్యంతో పెంచారు. సేవాగుణంతో పనిచేయాలని ఉద్బోధించారు. వారి జీవనశైలి కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది. ఆ దంపతులకు పుట్టిన బిడ్డ తులసి. డల్లాస్‌లో తులసి గబ్బర్డ్ హరిహర పీఠంతో పాటు పలు హిందూ దేవాలయాలను సందర్శించారు.

English summary
Last night, Hawaii not only elected Japan born Mazie Hirono to be the first ever Asian - American woman elected to the senate, they also elected Democrat Tulsi Gabbard as the first ever practicing Hindu to the US House of Representatives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X