హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యుపిలో తెలుగోళ్లకు చుక్కెదురు, పటాన్‌చెరు వాసి విన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Azharuddin -Jayaprada
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ సాధారణ ఎన్నికలలో అక్కడ మన తెలుగు వారు తమ సత్తా చాటుకోలేక పోయారు. తమ తమ పార్లమెంటు నియోజకవర్గాలలోని అసెంబ్లీ నియోజకవర్గాలలోనే తమ పార్టీని, తమ అభ్యర్థులను గెలిపించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు, మాజీ భారత జట్టు క్రికెట్ కెప్టెన్ అజహరుద్దీన్ మొరాదాబాద్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే తన నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానాన్ని ఆయన గెలిపించుకోలేక పోయారు. స్వయంగా మొరాబాద్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని కూడా ఎస్పీ అభ్యర్థికి సమర్పించేశారు. ఐదింటిలో రెండింటిలో ఎస్పీ, బిజెపి, బిఎస్పీ, పీస్ పార్టీలు ఒక్కో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఆయా స్థానాల్లో కాంగ్రెసు రెండో స్థానాన్ని కూడా దక్కించుకోక పోవడం గమనార్హం.

మొరాదాబాద్, మొరాదాల నుండి ఎస్పీ, బర్హపూర్ లో బిఎస్పీ, కాంత్ లో పీస్, ఠాకుర్ లో బిజెపి పార్టీలు గెలుపొందాయి. మొరాదాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అజహరుద్దీన్ పైన తీవ్ర వ్యతిరేకత ఉందని వార్తలు వచ్చాయి. ఆయన గెలిచినప్పటి నుండి తన పార్లమెంటు పరిధి అభివృద్ధిపై దృష్టి సారించలేదని, అక్కడ సందర్శించిన సందర్భాలు తక్కువేనని అంటున్నారు. అందుకే ఆయన ప్రచార సమయంలో తన నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఇబ్బందులు పడినట్లు వార్తలు వచ్చాయి. ఇక రాంపూర్ స్థానం నుండి కూడా ప్రముఖ తెలుగు నటి, ఆంధ్రా నుండి యుపి షిఫ్ట్ అయిన రాజకీయ నాయకురాలు జయప్రద కూడా తన అభ్యర్థిని గెలిపించుకోలేక పోయింది. తన ప్రత్యర్థి అజంఖాన్‌ను ఓడించేందుకు ఆమె తీవ్రంగా కృషి చేసింది. ఆయనే లక్ష్యంగా రాంపూర్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేసింది. అయినప్పటికీ ఆమె అజంఖాన్ గెలుపును అడ్డుకోలేక పోయింది.

కాగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాద్ శివారులోని పటాన్ చెరు వాసి మనోజ్ కుమార్ సింగ్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. చందూరు జిల్లా సయ్యద్ రాజా నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేసి గెలిచారు. మనోజ్ తల్లిదండ్రులు చాలా కాలం క్రితమే యుపి నుండి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. అయితే మనోజ్ మాత్రం అక్కడి రాజకీయాలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎస్పీ నేత అయిన ఆయనకు ఆ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

English summary
MP Azharuddin and MP Jayaprada filed in Uttar Pradesh election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X