వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేఖ కలకలం: లీకేజిపై ఎవరికి వారు ఆరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishore Chandra Dev
కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ లేఖ కాంగ్రెసు పార్టీలో కలకలం రేపుతోంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు అసమర్థులు అని, బొత్స లిక్కర్ డాన్ అని ఆ లేఖలో ఘాటైన వ్యాఖ్యలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఈ లేఖ వార్తలను ఇటు బొత్స అటు కిషోర్ కొట్టి పారేశారు. తాను అలాంటి లేఖ రాయలేదని కిషోర్ సోమవారం సాయంత్రం చెప్పారు.

అయితే అంతకుముందు ఉదయం మాత్రం కిరణ్, బొత్స, శత్రుచర్ల విజయరామరావులపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాస్తానని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవడం లేదని ఆయన వారిపై చేస్తున్న ఆరోపణలు. రాయనున్న లేఖ విషయాన్ని పక్కన పెడితే కిషోర్ ఖచ్చితంగా లేఖ రాసి ఉంటారని అంటున్నారు. అయితే అధిష్టానం తలంటడంతో ఆతను తాను లేఖ రాయలేదని చెబుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎక్కడి నుండి లీకైంది

లేఖలో కిరణ్ బాధ్యతలు చేపట్టి ఏడాది దాటినా సరైన పని తీరు కనబర్చడం లేదని ఉండటంతో ఆ లేఖ దాదాపు పది నెలల క్రితం రాసి ఉంటారనే అభిప్రాయానికి వస్తున్నారు. అయితే అప్పటి లేఖను ఇప్పుడు బయట పెట్టడం వెనుక వ్యూహంపై ఇటు బొత్స, కిరణ్, అటు కిషోర్ వర్గంతో పాటు కాంగ్రెసు వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. లేఖ ఎక్కడి నుండి లీకైందనే చర్చ ఇప్పుడు కాంగ్రెసులో ప్రధానంగా జరుగుతోంది.

హిందూస్థాన్ టైమ్స్ వంటి ఆంగ్ల పత్రికలో ఈ లేఖ కథనం రావడంతో ఏఐసిసి స్థాయిలోనే ఈ లేఖ లీకై ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వారు, బొత్స సత్తిబాబుపై వ్యతిరేకించే వర్గం ఇది బయట పెట్టి ఉండవచ్చునని అంటున్నారు. ఎక్కడి నుండి లీకైందనే విషయంపై ఎవరికి వారు ఆరా తీస్తున్నారట.

English summary
The debate is going in Congress party that who is behind Kishore Chandra Dev's letter leak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X