వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు, టిఆర్ఎస్‌లకు 'మహబూబ్‌నగర్' చిక్కులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mahaboobnagar
అధికార కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోనే చిక్కులు వస్తున్నాయి. త్వరలో తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలతో పాటు కొవ్వూరులో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆయా పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను దాదాపు ఖరారు చేశాయి. సెంటిమెంట్ అంశం ప్రధానంగా తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి పోటీ చేస్తున్న నాగర్ కర్నూలు మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాలలో టిఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే మహబూబ్ నగర్ నియోజకవర్గం విషయంలో మాత్రం టిఆర్ఎస్‌కు బిజెపి నుండి ఎదురు దెబ్బ తగులుతోంది. ఈ స్థానంపై అసంతృప్తి కారణంగా మరో రెండు చోట్లు పోటీ చేసేందుకు బిజెపి సంసిద్ధమైంది. తెలంగాణ కోసం జెఏసిలో భాగంగా టిఆర్ఎస్‌తో కలిసి ఉద్యమిస్తున్నప్పటికీ 2014 ఎన్నికలే లక్ష్యంగా బిజెపి ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధపడుతోందని అంటున్నారు. పాలమూరులో అభ్యర్థి అంశం బిజెపికి బాగా కలిసి వచ్చింది. ఉద్యమంలో కలిసి వెళుతున్నప్పటికీ అభ్యర్థిని ప్రకటించే ముందు తమను సంప్రదించక పోవడం బిజెపికి ఆగ్రహం తెప్పించిందట. అందుకే ఆ స్థానం నుండి తాము పోటీ చేస్తున్నట్టు బిజెపి ప్రకటించింది.

మీ నిర్ణయం కాంగ్రెసు, టిడిపిలకు లబ్ధి చేకూరుస్తుందని కాబట్టి వెనక్కి తగ్గాలని టిఆర్ఎస్ బిజెపిని విజ్ఞప్తి చేస్తోంది. అయితే అభ్యర్థి విషయంలో మార్పులు చేర్పులు ఉంటే తప్ప తాము వెనక్కి తగ్గేది లేదని బిజెపి ఖరాఖండిగా చెబుతోందట. దీంతో టిఆర్ఎస్‌కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మరో విషయమేమంటే టిఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర రావు ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటు స్థానంలోనే మహబూబ్ నగర్ ఉంది. దీంతో మిగిలిన సీట్ల కంటే ఈ సీటు టిఆర్ఎస్‌కు ప్రతిష్టాత్మకం. ఇక్కడ భారీ మెజార్టీతో గెలవాలనే ఉద్దేశ్యంతో మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపారు. కానీ బిజెపి నిర్ణయం వారికి షాక్ ఇచ్చింది. బరిలో నిలవవద్దని టిఆర్ఎస్ ఎంతగా విజ్ఞప్తి చేసినప్పటికీ బిజెపి మాత్రం అభ్యర్థి విషయంలో మీరు తగ్గితేనే మేం పునరాలోచిస్తామను కుండబద్దలు కొడుతోందట. విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకుందామన్న బిజెపి సూచనను టిఆర్ఎస్ పక్కన పెట్టడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కేవలం బిజెపియే కాదు టిఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థిని స్థానిక టిఆర్ఎస్ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారట. దీంతో ఇప్పుడు టిఆర్ఎస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. అభ్యర్థిపై వెనక్కి తగ్గితే ఓ రకంగా, వెనక్కి తగ్గకపోతే మరోరకంగా నష్టం.

కాంగ్రెసునూ ఇదే నియోజకవర్గంలో ఎక్కువ కష్టాలు వెంటాడుతున్నాయి. దివంగత ఎమ్మెల్యే రాజశ్వర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మికి టిక్కెట్ కేటాయించేందుకు కాంగ్రెసు నిర్ణయానికి వచ్చింది. అయితే విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని మిగిలిన నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ తరఫున ఆమెకే టిక్కెట్ కేటాయించిన పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా మరొకరిని రంగంలోకి దింపేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా మంత్రి డికె ఆరుణ మద్దతు కూడా అభ్యర్థిని వ్యతిరేకిస్తున్న వారికే ఉందని సమాచారం. స్వతంత్ర అభ్యర్థిగా మరో కాంగ్రెసు నేత బరిలోకి దిగితే పార్టీ ఓట్లు చీలి భారీ నష్టం వాటిల్లుతుందని అధికార పార్టీ భయపడుతోంది. విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారు మాత్రం వెనక్కి తగ్గటం లేదని సమాచారం.

English summary
Mahaboobnagar constituency is very difficult to Congress and TRS in by election. BJP is planning to contest from same seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X