వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: శ్రీకృష్ణ కమిటీ ఆరో సిఫార్సే..

By Pratap
|
Google Oneindia TeluguNews

Srkrishna
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయం ఇంకా సాధ్యపడలేదు కాబట్టి దాని కోసం చర్చల ప్రక్రియను ప్రారంభిస్తామని చెబుతూ శ్రీకృష్ణ కమిటీ చేసిన ఆరో సిఫార్సు అమలుకు సిద్ధపడుతున్నామని కేంద్ర చెప్పే అవకాశం ఉంది. ఈ ఆరో సిఫార్సు ఎజెండాగానే ఈ నెల 28వ తేదీ అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సమస్య నుంచి గట్టేందుకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆరో సూచనను అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణకు రాజకీయ సాధికారితను ప్రసాదించి, సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం రాజ్యాంగబద్థమైన తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీ తన ఆరో సిఫార్సుగా ముందుకు తెచ్చింది. ప్రాంతీయ మండలి ఏర్పాటు చేసి, క్రమంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ దిశగా అడుగులు వేస్తామని కేంద్రం చెప్పే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దీనికి ఇరు ప్రాంతాల నేతలు అంగీకరించే అవకాశం ఉందని కూడా సుశీల్ కుమార్ షిండే భావిస్తున్నారని అంటున్నారు.

తెలంగాణ అంశాన్ని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ అంశంగానే చూస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు తెలంగాణ ప్రక్రియ మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై ఇక ముందు ఏది చేసినా, ఏది చెప్పినా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని అనుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌లో ఆర్థికపరమైన అంశమే ప్రధానమైందని, అందువల్ల రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను విడదీసి తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఓ ప్యాకేజీ మాదిరిగా ఇచ్చే ప్రాంతీయ మండలి ఏర్పాటు వల్ల సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించవచ్చునని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీలోనూ ప్రభుత్వంలోనూ రాహుల్ గాంధీ కీలకమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో తెలంగాణ అంశాన్ని భవిష్యత్తు నిర్ణయం కోసం ఆయనకే వదిలేయాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంస్కరణల కోణంలో కూడా తెలంగాణ అంశాన్ని చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా, శ్రీకృష్ణ కమిటీ ఆరో ప్రతిపాదన సమస్యకు పరిష్కారం చూపగలదని కేంద్రం భావిస్తోంది.

శ్రీకృష్ణ కమిటీ ఆరు ప్రతిపాదనలు ఇవి...

1. ఏ చర్యలూ తీసుకోకుండా యధాతథ స్థితిని కొనసాగించాలి
2. రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విడగొట్టాలి. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి. రెండు రాష్ట్రాలకూ వేర్వేరు రాజధానులను అభివృద్ధి చేయాలి
3. రాష్ట్రాన్ని రాయల - తెలంగాణ, కోస్తాంధ్రలుగా విభజించాలి. హైదరాబాదును రాయల తెలంగాణలో అంతర్భాగంగా ఉంచాలి.
4. రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించాలి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని మండలాలను కలిపి గ్రేటర్ హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా విస్తరించాలి. తద్వారా గుంటూరు, రాయలసీమలోని కర్నూలు జిల్లాలతో దానికి భౌగోళిక సంబంధం ఉండేలా చూడాలి.
5. ప్రస్తుత సరిహద్దుల ప్రకారం తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలుగా విభజించాలి. తెలంగాణకు హైదరాబాదును రాజధానిగా ఉంచాలి. సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలి.
6. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, తెలంగాణ ప్రాంతానికి రాజకీయ సాధికారత, సామాజిక - ఆర్థికాభివృద్ధి కోసం తెంలగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి. దానికి రాజ్యాంగబద్ధత కల్పించాలి.

English summary
According to news reports - UPA gobernment is keen on 6th recommandation of Srikrishna committee to solve Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X